నీతిగల యెహోవా స్తుతి | Neethigala Yehovaa Sthuthi | Telugu Christian Song Lyrics | Download

Neethigala Yehovaa Sthuthi | నీతిగల యెహోవా స్తుతి | Telugu Christian Song Lyrics

నీతిగల యెహోవా స్తుతి

    నీతిగల యెహోవా స్తుతి మీ – ఆత్మతో నర్పించుడి 

    మీ ఆత్మతో నర్పించుడి – దాతయవు మన క్రీస్తు నీతిని 

    దాల్చుకొని సేవించుడి       ||నీతి|| 


1. చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగా 

    సదమలంబగు దైవ నామము – సర్వదా నుతి జేయును      ||నీతి|| 


2. సర్వశక్తుని కార్యముల కీ – సర్వ రాష్ట్రము లన్నియు 

    గర్వములు విడి తలలు వంచుచు – నుర్విలో నుతిజేయను      ||నీతి|| 


3. గీత తాండవ వాద్యములచే – బ్రీతి పరచెడు సేవతో 

    పాతకంబులు పరిహరించెడు – దాతనే సేవించుడి      ||నీతి|| 


4. పరమ దూతలు నరులు పుడమిని – మొరలుబెట్టుచు దేవుని 

    పరము నందున్నట్టి యేసుని – పాదములు సేవింతురు      ||నీతి|| 


5. ఇలను భక్తులు గూడుకొనియా – బలము గల్గిన దేవుని 

    వెలయు స్తుతి వే నోళ్ళతోడను – విసుగు జెందక జేయుడి      ||నీతి|| 


6. ఆత్మ నీవిక మేలుకొని శు – ధ్ధాత్మ యేసుని దండ్రిని 

    త్రిత్వమగునా యేక దేవుని – హర్షమున సేవింపవే      ||నీతి||