దేవర నీ దీవెనలు | Devara Nee Deevenalu | Telugu Christian Wedding Song Lyrics | Download

Devara Nee Deevenalu | దేవర నీ దీవెనలు | Telugu Christian Wedding Song Lyrics

దేవర నీ దీవెనలు

దేవర నీ దీవెనలు 
    ధారాళముగను వీరలపై 
    బాగుగ వేగమే దిగనిమ్ము 
    పావన యేసుని ద్వారగను (2) 

1. దంపతులు దండిగ నీ 
    ధాత్రిలో వెలయుచు సంపదలన్ 
    సొంపుగ నింపుగ పెంపగుచు 
    సహింపున వీరు సుఖించుటకై       ||దేవర నీ|| 

2. ఈ కవను నీ కరుణన్ 
    ఆకరు వరకును లోకములో 
    శోకము లేకయే ఏకముగా 
    బ్రాకటముగను జేకొనుము            ||దేవర నీ|| 

3. ఇప్పగిది నెప్పుడును 
    గొప్పగు ప్రేమతో నొప్పుచు దా 
    మొప్పిన చొప్పున దప్పకను 
    మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్      ||దేవర నీ|| 

4. తాపములు పాపములు 
    మోపుగ వీరిపై రాకుండగా 
    గాపుగ బ్రాపుగ దాపునుండి 
    యాపదలన్నియు బాపుచును        ||దేవర నీ|| 

5. సాధులుగన్ జేయుటకై 
    శోధనలచే నీవు శోధింపగా 
    కదలక వదలక ముదమున నీ 
    పాదము దాపున బాదుకొనన్          ||దేవర నీ|| 

6. మెండుగ భూమండలపు 
    గండములలో వీరుండగను 
    తండ్రిగ దండిగ నండనుండి 
    వెండియు వానిని ఖండించావే         ||దేవర నీ|| 

7. యిద్దరు వీరిద్దరును 
    శుద్ధులై నిన్ను సేవించుటకై 
    శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్ 
    దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్        ||దేవర నీ|| 

8. వాసిగ నీ దాసులము 
    చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని 
    మా సకలేశ్వర నీ సుతుడ 
    యేసుని పేరిట బ్రోవుమామేన్        ||దేవర నీ||