Randi Utsaahinchi Paadudamu | రండి ఉత్సాహించి పాడుదము | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.26 - దావీదు కీర్తన 95

రండి యుత్సహించి పాడుదుము- రక్షణ దుర్గము మన ప్రభువే

॥ రండి ॥

1. రండి కృతజ్ఞత స్తోత్రముతో -రారాజు సన్నిధి కేగుదుము= సత్ప్రభు నామము
కీర్తనలన్-సంతోషగానము చేయుదము

॥ రండి ॥

2. మన ప్రభువే మహా దేవుండు-ఘన మహాత్మ్యముగల రాజు=
భూమ్యగాధపులోయలును- భూధర శిఖరము లాయనవే

॥ రండి ॥

3. సముద్రము సృష్టించె నాయనదే- సత్యుని హస్తమే భువింజేసెన్=
ఆయన దైవము పాలితుల-మాయన మేపెడి గొట్టెలము

॥ రండి ॥

4. ఆ ప్రభు సన్నిధి మోకరించి -ఆయన ముందర మొక్కుదము=
ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును

॥ రండి ॥

5. తండ్రి కుమార శుద్ధాత్మకును-దగు స్తుతి మహిమలు కల్లుంగాక=
ఆదిని నిప్పుడు నెల్లప్పుడు -నయినట్లు యుగముల నౌను ఆమేన్

॥ తండ్రి ॥

––సమూయేలు పాక్యనాథము

Randi yuthsahinchi paadudumu- rakshana durgamu mana prabhuve

|| Randi ||

1. Randi kruthagjnatha sthothramutho -raaraaju sannidhi keegudumu= sathprabhu naamamu
Keerthanalan-santhoshagaanamu cheeyudumu

|| Randi ||

2. Mana prabhuve mahaa deevundu-ghana mahaathmyamugala raaju=
Bhoomyagaadhapuloyalunu- bhoodhara shikharamu laayanave

|| Randi ||

3. Samudramu srushtinche naayanade- sathyuni hasthame bhuvimjeesen=
Aayana daivamu paalithula-maayana meepedi gottelamu

|| Randi ||

4. Aa prabhu sannidhi mokarinchi -aayana mundara mokkudamu=
Aayana maatalu gaikonina nayyavi manakentho meelagunu

|| Randi ||

5. Thandri kumaara shuddhaathmakunu-dagu sthuthi mahimalu kallungaaka=
Aadini nippudu nellappudu -nayinatlu yugamula naunu Aamen

|| Thandri ||

––Samooyelu Paakyanaathamu

Comments