నీ వాక్యమే నన్ను బ్రతికించెను | Nee Vaakyame Nannu Brathikinchenu | Telugu Christian Song Lyrics | Download

నీ వాక్యమే నన్ను బ్రతికించెను,telugu christian songs,nee vakyame nannu brathikinchenu,latest telugu christian songs,nee vaakyame nannu brathikinchenu,నీ వాక్యమే నన్ను బ్రతికించెను lyrics,telugu christian songs 2020,nee vakyame nannu brathikinchenu song,nee vakyame nannu brathikinchenu christian song,new telugu christian songs,nee vakyame nannu brathikinchenu lyrics,nee vakyame nannu brathikinchenu track,latest telugu christian songs lyrics

నీ వాక్యమే నన్ను బ్రతికించెను

నీ వాక్యమే నన్ను బ్రతికించెను 
బాధలలో నెమ్మదినిచ్చెను (2) 
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా 
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2)      ||నీ వాక్యమే|| 

జిగటగల ఊభినుండి లేవనెత్తెను 
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2) 
నా పాదములకు దీపమాయెను (2) 
సత్యమైన మార్గములో నడుపుచుండెను (2)       ||నీ వాక్యమే|| 

శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై 
యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2) 
అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2) 
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2)       ||నీ వాక్యమే|| 

పాలవంటిది జుంటి తేనె వంటిది 
నా జిహ్వకు మహా మధురమైనది (2) 
మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2) 
రత్న రాసులకన్నా కోరతగినది (2)           ||నీ వాక్యమే||