ప్రార్థన వినెడి పావనుడా | Prardhana Vinedi Pavanuda | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,prardhana vinedi pavanuda song,latest telugu christian songs,prardhana vinedi pavanuda song lyrics in telugu,christian songs telugu,prardhana vinedi pavanuda song download,prarthana vinedi song lyrics,pradana vinedi pavanuda telugu songs,prarthana vinedi pavanuda,prardhana vinedi pavanuda christian song,christian telugu songs,telugu christian song | ప్రార్ధన వినెడి పవనుడా | pradana vinedi pavanuda |,prardhana vinedi pavanuda

    ప్రార్థన వినెడి పావనుడా 

    ప్రార్థన మాకు నేర్పుమయా                ||ప్రార్థన|| 


1. శ్రేష్టమైన భావము గూర్చి 

    శిష్య బృందముకు నేర్పితివి 

    పరముడ నిన్ను ప్రనుతించెదము 

    పరలోక ప్రార్థన నేర్పుమయా              ||ప్రార్థన|| 


2. పరమ దేవుడవని తెలిసి 

    కరము లెత్తి జంటగా మోడ్చి 

    శిరమునువంచి సరిగను వేడిన 

    సుంకరి ప్రార్థన నేర్పుమయా               ||ప్రార్థన|| 


3. దినదినంబు చేసిన సేవ 

    దైవ చిత్తముకు సరిపోవ 

    దీనుడవయ్యి దిటముగా కొండను 

    చేసిన ప్రార్థన నేర్పుమయా                 ||ప్రార్థన|| 


4. శత్రుమూక నిను చుట్టుకొని 

    సిలువపైన నిను జంపగను 

    శాంతముతో నీ శత్రుల బ్రోవగ 

    సలిపిన ప్రార్థన నేర్పుమయా            ||ప్రార్థన||