రాజులకు రాజైన | Raajulaku Raajaina | Telugu Christian Song Lyrics | Download
రాజులకు రాజైన ఈ మన విభుని
పూజ చేయుటకు రండి
ఈ జయశాలి కన్నా
మనకింకా రాజెవ్వరును లేరని ||రాజులకు||
1. కరుణ గల సోదరుండై ఈయన
ధరణికేతెంచెనయ్యా (2)
స్థిరముగా నమ్ముకొనిన
మనకొసగు పరలోక రాజ్యమును ||రాజులకు||
2. నక్కలకు బొరియలుండే నాకాశ
పక్షులకు గూళ్లుండెను (2)
ఒక్కింత స్థలమైనను
మన విభుని కెక్కడ లేకుండెను ||రాజులకు||
3. త్వరపడి రండి రండి ఈ పరమ
గురుని యొద్దకు మీరలు (2)
దరికి జేరిన వారిని
ఈ ప్రభువు తరుమడెన్నడు దూరము ||రాజులకు||