జీవితాంతము వరకు నీకే | Jeevithaanthamu Varaku Neeke | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,జీవితాంతము వరకు నీకే,christian songs,christian songs telugu,telugu christian devotional songs,new telugu christian songs,telugu christian songs latest,latest telugu christian songs,jivithanthamu varaku nike telugu christian song,జీవితాంతము వరకు నీకే song,telugu christian songs lyrics,jesus songs telugu,jeevithaanthamu varaku neeke song,andhra kristava keerthanalu |జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని | jeevithanthamu varaku

జీవితాంతము వరకు నీకే

జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని 

నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా (2) ||జీవితాం|| 


ఎన్ని యాటంకంబులున్నను ఎన్ని భయములు కల్గిన (2) 

అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా ||జీవితాం|| 


అన్ని వేళల నీవు చెంతనె యున్న యను భవమీయవె (2)

తిన్నగా నీ మార్గమందున పూనినడచెద రక్షకా ||జీవితాం|| 


నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను (2)

శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా ||జీవితాం|| 


నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్ (2)

చెదర గొట్టుము రూపుమాపుము శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాం|| 


మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే (2)

ఇహము దాటినదాక నిన్ను వీడనంటిని రక్షకా ||జీవితాం|| 


పాప మార్గము దరికి బోవక పాత యాశల గోరక (2) 

ఎపుడు నిన్నే వెంబడింపగ కృప నొసంగుము రక్షకా ||జీవితాం||