యేసు రాజుగా వచ్చుచున్నాడు | Yesu Raajugaa Vachchuchunnaadu | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,telugu jesus songs,యేసు రాజుగా వచ్చుచున్నాడు,jesus songs telugu,latest telugu christian songs lyrics,jesus songs in telugu,christian songs,telugu christian songs latest,new telugu christian songs,christian songs telugu,jesus telugu songs,యేసు రాజుగా వచ్చుచున్నాడు lyrics,telugu chiristian worship song with lyrics,latest christian songs,telugu christian status songs,top christian songs

యేసు రాజుగా వచ్చుచున్నాడు

యేసు రాజుగా వచ్చుచున్నాడు 

భూలోకమంతా తెలుసుకొంటారు (2) 

రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) 

రారాజుగా వచ్చు చున్నాడు (2)    ||యేసు|| 


మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు 

పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2) 

లోకమంతా శ్రమకాలం (2) 

విడువబడుట బహుఘోరం        ||యేసు|| 


ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది 

ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2) 

ఈ సువార్త మూయబడున్‌ (2) 

వాక్యమే కరువగును         ||యేసు|| 


వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును 

ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2) 

నీతి శాంతి వర్ధిల్లును (2) 

న్యాయమే కనబడును        ||యేసు|| 


ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర 

సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2) 

వంగని మోకాళ్ళన్నీ (2) 

యేసయ్య యెదుట వంగిపోవును        ||యేసు|| 


క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ 

కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2) 

రెప్ప పాటున మారాలి (2) 

యేసయ్య చెంతకు చేరాలి        ||యేసు||