దేవుని వారసులం | Devuni Vaarasulam | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,christian songs,telugu christian songs latest,devuni varasulam song download,popular christian songs,devuni varasulam song lyrics,telugu lyrics,jesus telugu songs,devuni varasulam lyrics,famous christian songs,telugu jesus songs,christian telugu songs,christian songs telugu,christian songs 2020,telugu old christian songs,telugu christian songs old,new telugu christian songs

దేవుని వారసులం

దేవుని వారసులం – ప్రేమ నివాసులము 

జీవన యాత్రికులం – యేసుని దాసులము 

నవ యుగ సైనికులం – పరలోక పౌరులము 

హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము       ||దేవుని|| 


సజీవ సిలువ ప్రభు – సమాధి గెలుచుటకే 

విజేత ప్రేమికులం – విధేయ బోధకులం 

నిజముగ రక్షణ ప్రబలుటకై 

ధ్వజముగ సిలువను నిలుపుదుము (2)      ||దేవుని|| 


ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా 

విభు మహిమను గాంచ – విశ్వమే మేము గోల 

శుభములు గూర్చుచు మాలోన 

శోభిల్లు యేసుని చూపుదుము (2)      ||దేవుని|| 


దారుణ హింస లలో – దేవుని దూతలుగా 

ఆరని జ్వాలలలో – ఆగని జయములతో 

మారని ప్రేమ సమర్పణతో 

సర్వత్ర యేసుని కీర్తింతుము (2)      ||దేవుని|| 


పరిశుద్దాత్మునికై – ప్రార్థన సలుపుదము 

పరమాత్ముని రాక – బలము ప్రసాదింప 

ధరణిలో ప్రభువును జూపుటకై 

సర్వాంగ హోమము జేయుదము (2)      ||దేవుని|| 


అనుదిన కూటములు – అందరి గృహములలో 

ఆనందముతోను – ఆరాధనలాయే 

వీనుల విందగు పాటలతో 

ధ్యానము చేయుచు మురియుదము (2)      ||దేవుని|| 


హత సాక్షుల కాలం – అవనిలో చెలరేగ 

గతకాలపు సేవ – గొల్గొతా గిరి జేర 

భీతులలో బహు రీతులలో 

నూతన లోకము కాంక్షింతుము (2)       ||దేవుని||