Choochuchunnaamu Nee Vaipu | చూచుచున్నాము నీ వైపు | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.11 - దేవుని వైపు చూచుట
చూచుచున్నాము నీ వైపు - మా ప్రియ జనక - చూచుచున్నాము నీ
వైపు = చూచుచు నీ ప్రేమ-సొంపు సువార్తను - జాచుచు గరములు -
చక్కంగా నీవైపు
॥ చూచు ॥
1. మేమరులమై యుంటిమి- -మార్గము వీడి- మేమందరము పోతిమి=
ప్రేమచే నప్పుడు- ప్రియ తనయు నంపించి- క్షేమమార్గము మాకు-
బ్రేమను జూపితివి
॥ చూచు ॥
2. నిను నమ్ముపాపులకు-వారెవరైన- నీశరణు జొచ్చువారలకు=
ఇనుడవు కేడెంబు-నీ జగతిలో నగుచు- గనుపరచుచుందువు-
ఘనమైన నీ కృప
॥ చూచు ॥
3. నీ భయము మా యెదలను- నిలుపుము నీదు-ప్రాభవ మొనరంగను=
నీ భయముచే మేము- వైభవ మొందుచు-నే భయము లేకుండ- నీ
భువిని గొన్నాళ్ళు
॥ చూచు ॥
4. దయజూచి మమ్ము నెప్పుడు -మంచివి యన్ని-దయచేయు మెల్లప్పుడు=
దయచేయరానివి దయచేయుమని కోర - దయజూపి మన్నించు దయగల
మా తండ్రి
॥ చూచు ॥
––పులిపాక జగన్నాధము
Choochuchunnaamu nee vaipu - maa priya janaka - choochuchunnaamu nee vaipu = choochuchu nee prema-sompu suvaarthanu - jaachuchu garamulu - chakkangaa neevaipu
|| Choochu ||
1. Memarulamai yuntimi- -maargamu veedi- memandaramu pothimi= premache nappudu- priya thanayu nampinchi- kshemamaargamu maaku- bremanu joopithivi
|| Choochu ||
2. Ninu nammupaapulaku-vaarevaraina- neesharanu jocchuvaaralaku= inudavu kedembu-nee jagathilo naguchu- ganuparachuchunduvu- ghanamaina nee krupa
|| Choochu ||
3. Nee bhayamu maa yedalanu- nilupumu needu-praabhava monaranganu= nee bhayamuche memu- vaibhava monduchu-ne bhayamu lekunda- nee bhuvini gonnaallu
|| Choochu ||
4. Dayajoochi mammu neppudu -manchivi yanni-dayacheyu mellappudu= dayacheyaraanivi dayacheyumani kora - dayajoopi manninchu dayagala maa thandri
|| Choochu ||
––Pulipaaka Jagannaadhamu
Comments
Post a Comment