సన్నుతింతుమో ప్రభో | Sannuthinthumo Prabho | Andhra Kristhava Keerthanalu Lyrics | Download

సన్నుతింతుమో ప్రభో,Sannuthinthumo Prabho,christian songs,christian songs 2020,christian music,worship,new christian,jesus,jesus songs,god songs,jesus music,telugu jesus songs,christian,jesus telugu songs,latest telugu christian songs,telugu christian songs,new songs,christmas songs,popular songs,jesus songs telugu,2020,bekind,#jesussongs,hosanna songs,devotional songs,ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు,hosanna,yesu,calvary temple live,calvary

సన్నుతింతుమో ప్రభో

సన్నుతింతుమో ప్రభో 

సదమలమగు భక్తితో (2) 

కన్న తండ్రి కావుమా (2) 

కలుషము నెడబాపుమా         ||సన్నుతింతుమో|| 


నీతి సూర్య తేజమా 

జ్యోతి రత్న రాజమా (2) 

పాతక జన రక్షకా (2) 

పతిత పావన నామకా         ||సన్నుతింతుమో|| 


మానవ సంరక్షకా 

దీన నిచయ పోషకా (2) 

దేవా మానవ నందనా (2) 

దివ్య సుగుణ మందనా         ||సన్నుతింతుమో|| 


ప్రేమ తత్వ బోధకా 

క్షేమ దాత వీవెగా (2) 

కామిత ఫలదాయక (2) 

స్వామి యేసు నాయక         ||సన్నుతింతుమో|| 


పాప చింతలన్నిటిన్ 

పారదోలుమో ప్రభో (2) 

నీ పవిత్ర నామమున్ (2) 

నిరతము స్మరియించెదన్         ||సన్నుతింతుమో||