స్తుతియు మహిమయు | Sthuthiyu Mahimayu | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,christian songs,telugu christian song,sthuthiyu mahima ganatha neeke telugu christian song,latest christian songs,telugu christian songs 2019,స్తుతియు మహిమయు,2021 latest telugu christian songs,telugu christian devotional songs,sthuthiyu mahima ganatha neeke lyrics song,sthuthiyu mahima ganatha neeke christian song,sthuthiyu mahima ganatha neeke lyrics,sthuthiyu mahimayu bible mission song,sthuthiyu mahimayu

స్తుతియు మహిమయు

స్తుతియు మహిమయు నీకే-క్షితికిన్‌ దివికిన్‌ నీటి-వితతికిన్‌ కర్తవై- వెలయు 

మా దేవ = ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు-హితుడా మా ప్రేమ నీ -  కెట్లు చూపుదును 


1. పసిడి వర్ణపుటెండ- భాగ్యధారల వాన - విసరు మంచిగాలి - విరియు 

    పుష్పములు = రసమొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్‌ చాటున్‌ - ప్రసరించు 

    కోతలో - ఫలనుందు వీవు 


2. నెమ్మదిగల యిండ్లు-నిజ సౌఖ్య కాలములు-ఇమ్మహి ఫలియించు - 

    నైశ్వర్యాధికముల్‌ = ఇమ్ముగ గలిగిన - హృదయులమై వందనమ్ములు 

    ఋణపడి - యున్నాము నీకు 


3. దురితంబు లొనరించి - దౌర్భాగ్యస్థితి నున్న - ధరణికి నీ పుత్రున్‌- 

    ధర్మంబుజేసి = నరుల కిధర్మమున - కొరత దీర్చెడు సర్వ - వరము 

    లమర్చిన - పరమోపకారి 


4. జీవంబు ప్రేమను - జివను గల్గించెడు - పావనాత్మను మాకై పంపితివి = 

    దీవెనలేడు రె - ా్లవరింపను మమ్ము - నీ విమలాత్మన్‌ మాలో గుమ్మరించు 


5. నరులకు విమోచ - నముగల్గె పాపంబుల్‌-పరిహారమాయె గృ- పాసాధ 

    నములు = దొరికె మోక్షాంశము - స్థిరమాయె మేము నీ - కొరకేమి 

    తేగలము పరిపూర్ణ జనక 


6. మాకై వాడుకొనెడి-రూకల్‌ వ్యర్ధంబగును-నీకై యప్పుగనిచ్చు-నిఖిల 

    వస్తువులు = శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ ధన నిధియై పై - లోకంబు నందుండు - లోపంబు లేక 


7. జీవంబు వస్తువులు-శ్రేయస్సు దాన స్వ-భావంబు శక్తియు- భాగ్యంబులు = 

    నీ వలననే లభ్యమై వెలయుచున్నవి-నీ వాసమే మాకు నిత్యానందంబు