యేసుని ప్రేమను నేమారకను | Yesuni Premanu Nemarakanu | Telugu Christian Song Lyrics | Download | Andhra Kristhava Keerthanalu
యేసుని ప్రేమను నేమారకను
యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలచవే యో మనసా (2)
వాసిగ నాతని వరనామంబును (2)
వదలక పొగడవె యో మనసా || యేసుని ||
పాపులకొరకై ప్రాణము బెట్టిన ప్రభు నిల దలచవె యో మనసా (2)
శాపము నంతయు జక్కగ నోర్చిన (2)
శాంతుని పొగడవె యో మనసా ||యేసుని||
కష్టములలో మన కండగ నుండిన కర్తను దలచవె యో మనసా (2)
నష్టములన్నియు నణచిన యాగురు (2)
శ్రేష్ఠుని ప్పొగడవె యో మనసా ||యేసుని||
మరణతఱిని మన శరణుగ నుండెడు మాన్యుని దలచవె యో మనసా (2)
కరుణను మన కన్నీటి దుడిచిన
కర్తను పొగడవె యో మనసా ||యేసుని||
ప్రార్థనలు విని ఫలముల నొసగిన ప్రభు నిక దలచవె యో మనసా (2)
వర్థన గోరుచు శ్రద్ధతో దిద్దిన (2)
వంద్యుని పొగడవె యో మనసా ||యేసుని||
వంచనలేక వరముల నొసగిన వరదుని దలచవె యో మనసా
కొంచెము కాని కూర్మితో దేవుని (2)
కొమరుని పొగడవె యో మనసా ||యేసుని||