దేవ సంస్తుతి చేయవే మనసా | Deva sanstuti cheyave manasa | Telugu Christian Popular Worship Song | Bible Mission Songs Lyrics | Download

Here are the SEO keywords separated by commas:  Christian devotional songs, Christian worship songs, Praise and worship songs, Christian praise songs, Christian songs in Telugu, Telugu worship songs, Christian devotional Telugu songs, Telugu praise and worship music, Jesus worship songs in Telugu, Christian bhakti songs, Praise the Lord songs in Telugu, Manasa Deva songs, Christian prayer songs, Telugu Christian worship hymns, Christian sankeerthanalu, Devotional music Telugu Christian, God praising songs Telugu, Best Christian songs in Telugu, Heartfelt worship songs, Songs of praise for God in Telugu, Telugu Christian worship songs with lyrics, Christian prayer songs for peace, Telugu devotional songs for church worship, Christian songs for meditation and worship, Best Telugu Christian devotional songs.
SONG NO. 04

దేవ సంస్తుతి చేయవే మనసా

దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీ మంతుడగు యె - 

హోవ సంస్తుతి చేయవే మనసా = దేవసంస్తుతి 

చేయుమా నా - జీవమా యెహోవ దేవుని - పావన నా 

- మము నుతింపుమా - నా యంతరంగము - లో వసించు - నో సమస్తమా


1. జీవమా యోహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు = 

    నీవు జేసిన పాతకంబులను - మన్నించి జబ్బు - 

    లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే || దేవ ||

2. చావు గోతి నుండి నిన్ను - లేవనెత్తి దయను కృపను = 

    జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద - 

    జీవకిరీటముగ వేయును - ఆ కారణముచే   || దేవ ||

3. యౌవనంబు పక్షిరాజు - యౌవనంబు వలెనె క్రొత్త = 

    యౌవనంబై వెలయు నట్లుగ - మేలిచ్చి నీదు - 

    భావమును సంతుష్టి పరచునుగా - ఆ కారణముచే    || దేవ ||

4. ప్రభువు నీతి పనులు చేయున్ - బాధితులకు న్యాయ 

    మీయున్ = విభుడు మార్గము తెలిపె మోషేకు - తన 

    కార్యములను - విప్పెనిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే  || దేవ ||

5. అత్యధిక ప్రేమ స్వరూపి - యైన దీర్ఘ శాంతపరుడు = 

    నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు - నీ 

    పై నెపుడు కోపముంచడు - ఆ కారణముచే   || దేవ ||

6. పామరులమని - ప్రత్యపకార - ప్రతిఫలంబుల్ పంప 

    లేదు = భూమి కన్న నాకసంబున్న - యెత్తుండు దైవ - 

    ప్రేమ భక్త జనులయందున - ఆ కారణముచే   || దేవ ||

7. పడమటికి తూర్పెంత యెడమో - పాపములకున్ 

    మనకు నంత యెడము కలుగజేసి యున్నాడు - మన 

    పాపములను - నెడముగానె చేసియున్నాడు - ఆ కారణముచే   || దేవ ||

8. కొడుకలపై తండ్రి జాలి - పడువిధముగా భక్తి పరుల = 

    యెడల జాలి పడును దేవుండు - తన భక్తి పరుల - 

    యెడల జాలి పడును దేవుండు - ఆ కారణముచే  || దేవ ||

9. మనము నిర్మితమైన రీతి - తనకు దెలిసి యున్న 

    సంగతి = మనము మంటి వార మంచును - జ్ఞాపకము 

    చేసి - కొనుచు స్మరణ చేయు చుండును - ఆ కారణముచే || దేవ ||

10. పూసి గాలి వీవ నెగిరి - పోయి బసకు దెలియని వన = 

    వాస పుష్పము వలెనె నరుడుండు - నరునాయువు 

    తృణ - ప్రాయము శ్రీ దేవ కృపమెండు - ఆ కారణముచే || దేవ ||

11. పరమ దేవ నిబంధనాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు = 

    నిరతమును కృప నిలిచి యుండును - యెహోవ నీతి 

    తరముల పిల్లలకు నుండును - ఆ కారణముచే  || దేవ ||

12. దేవుడాకాశమున గద్దె - స్థిర పరచుకొని సర్వమేలున్ = 

    దేవ దూతలారా దైవాజ్ఞ - విని వాక్యము నడుపు - 

    దిట్టమైన శూరులారా! - స్తోత్రంబు చేయుడి  || దేవ ||

13. దేవ సైన్యములారా ఆయన - దివ్య చిత్తము 

    నడుపునట్టి సేవ కావళులారా! దేవుని - పరిపాలన 

    చోట్ల - లో వసించు కార్యములారా - వందనము చేయుడి || దేవ ||