ఘనమైనవి నీ కార్యములు నా యెడల | Ghanamainavi nee karyamulu naa yedala | Telugu Christian Hosanna Ministries Song Lyrics | Download

Ghanamainavi Nee Kaaryamulu lyrics, Telugu Christian worship songs, Thanksgiving songs in Telugu, Jesus praise songs, Telugu gospel music, Kirtana Ministries Telugu songs, Devotional songs in Telugu, Telugu worship music, Christian songs about God's works, Telugu songs of gratitude

ఘనమైనవి నీ కార్యములు నా యెడల

ఘనమైనవి నీ కార్యములు నా యెడల

స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య

కృపలను పొందుచు కృతజ్ఞాత

కలిగి స్థుతులర్పించేదను అన్ని వేళలా

అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే || ఘనమైనవి ||


ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరణీయక

ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)

నా భారము బాపి బాసటగా నిలిచి ఆదరించితివి

ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) || ఘనమైనవి ||


నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే

ఆశ్రయమైనబండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే (2)

నా ప్రతి క్షణమును నీవు దీవెనెగా మార్చి నడిపించుచున్నావు - 

ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) || ఘనమైనవి ||


నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా - 

బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా ఎడ చాలున్నంటివే (2)

నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ

ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము (2)  || ఘనమైనవి ||