శుభాకరా శుద్ధాకరా వి - శుద్ధ వందనమ్ | Shubhaakaraa Shuddhaakaraa | Telugu Christian Song Lyrics | Bible Mission Song Lyrics
శుభాకరా శుద్ధాకరా
SONG NO. 01
1శుభాకరా! శుద్ధాకరా! వి - శుద్ధ వందనమ్ =
2నభా నభూమి సర్వౌ - న్నత్య వందనమ్
1. యెహోవ! స్రష్ట! జనక! నీకు-నెంతయు 3బ్రణుతి =
మహోన్నతుండ! దివ్యుడా! ఘన - మహిమ సంస్తుతిశుభా ||శుభా||
2. విమోచకా! 4పిత్రాత్మజుండ! - విజయ మంగళమ్ =
సమస్త సృష్టి సాధనంబ! - సవ్య మంగళమ్శుభా ||శుభా||
3. వరాత్మ! 5పితాపుత్ర నిర్గమ - పరుడ! స్తోత్రము =
వరప్రదుండ! భక్త హృదయ - వాస! స్తోత్రముశుభా ||శుభా||
1.శుభమునకు ఉనికిపట్టు 2.ఆకాశమందు 3.స్తుతి
4.తండ్రి యొక్క కుమారుడా!
5.తండ్రి నుండియు కుమారుని నుండియు బయలుదేరిన దేవా!