జుంటె తేనె ధారలకన్న యేసు | Junte Thene dharala kanna Yesu | Telugu Christian Song Lyrics | Download
జుంటె తేనె ధారలకన్న యేసు
జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం
యేసయ్యా సన్నిధి నే మరువజాలను
జీవిత కాలమంతా ఆనదించెదా యేసయ్యనే ఆరాధించెదా
యేసయ్య నామమే బహు పూజ్యనీయము
నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి
నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే
యేసయ్య నామమే బలమైన ధుర్గము
నాతోడై నిలచి క్షేమముగా నను దాచి
నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే
యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించె సువాసనగా నను మార్చె
నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే