లాలి లాలి లాలమ్మ లాలీ | Lali lali laalamma laali | Telugu Christian Christmas Song Lyrics | Bible Mission Songs | Download
SONG NO. 25
లాలి లాలి లాలమ్మ లాలీ
లాలి లాలి - లాలమ్మ లాలీ - లాలి
శ్రీ మరియమ్మ పుత్ర - నీకే లాలి
1. బెత్లెహేము పుర వా - స్తవ్య లాలి = భూలోక వాస్తవ్యులు
చేయు - స్తుతులివిగో లాలి || లాలి ||
2. పశువుల తొట్టె నీకు - పాన్పాయెను లాలి =
ఇపుడు పాపులమైన మా - హృదయములలో
పవళించుము లాలి || లాలి ||
3. పొత్తి వస్త్రములే నీకు - పొదుపాయెను లాలి =
మాకు మహిమ వస్త్రము - లియ్యను నీవు మహిలో
పుట్టితివా || లాలి ||
4. పశువుల పాకే నీకు - వసతి గృహమాయె =
మాకు మహిమ సౌధము - లియ్యను నీవు
మనుష్యుడవైతివా || లాలి ||
5. తండ్రి కుమార పరిశు - ద్ధాత్మలకే స్తోత్రం =
ఈ నరలోకమునకు వేంచేసిన శ్రీ - బాలునకే స్తోత్రం
|| లాలి ||