యేసు రాజు యేసేరాజు యేసు రాజు | Yesu Raju Yesu Raju Yesu Raju | Bible Mission Christmas Song Lyrics | Download
SONG NO. 26
యేసు రాజు యేసేరాజు యేసు రాజు
యేసు రాజు యేసేరాజు యేసు రాజు - ఈసా ప్రజాపతి
క్రీస్తే రాజు
1. రాక రాక వచ్చినాడు యేసు రాజు - రాక రాక
వచ్చినాడు క్రీస్తు రాజు || యేసు ||
2. లేక లేక కల్గినాడు యేసు రాజు - లోకమునకు
కల్గినాడు క్రీస్తు రాజు || యేసు ||
3. గొల్లలకు కాన్పించె యేసు రాజు - ఎల్లరకు
కాన్పించె క్రీస్తు రాజు || యేసు ||
4. జ్ఞానులకు కాన్పించె యేసు రాజు - అజ్ఞానులకు
కాన్పించె క్రీస్తు రాజు || యేసు ||
5. గగనమందు ఘనత నొందె యేసు రాజు - జగతియందు
ఘనత నొందె క్రీస్తు రాజు || యేసు ||
6. గౌతముని ప్రవచనము యేసే రాజు - భూతలమున
గురువు రాజు క్రీస్తే రాజు || యేసు ||
7. మొదట యెహోదీయులకు యేసే రాజు - పిదప
మనకందరకు క్రీస్తే రాజు || యేసు ||
8. హల్లెలూయ హల్లెలూయ యేసే రాజు - హల్లెలూయ
హల్లెలూయ క్రీస్తే రాజు || యేసు ||