ప్రేమామయుడు యేసుక్రీస్తు | Premamayudu Yesukristu | Christmas Song Lyrics 2024 | Jesus Christmas Song Lyrics | Download
ప్రేమామయుడు యేసుక్రీస్తు
పల్లవి
ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జన్మించెను
నిన్న నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను జీవాహారమై నిలిచెను
\\కోరస్\\
దేవునిప్రేమ శాశ్వతమైనది
మనలను రక్షించగా ఇలలో వెలసినది
మనలను రక్షించగా ఇలలో వెలసినది
చరణం 1
పరమునేలె పరిశుద్ధుడు భువికేతెంచగా
వరములు సెలయేరులై ప్రవహించెను
క్రీస్తు శరీరరక్తములను స్వీకరింతుము
ఇమ్మానుయేలుదేవుని సేవింతుము \\కోరస్\\
చరణం 2
భువినిఏలె క్రీస్తునివిందును స్వీకరించగా
పవిత్రబాటలో నిత్యం పయనింతుము
జీవాధిపతియైన దేవుని స్తుతియించెదము
ఆనందముగ అనుదినము ఆత్మలో నడిచెదము \\కోరస్\\
చరణం 3
హృదినిఏలె శ్రీయేసు మనలో వెంచేయగా
శాంతి సమాధానములు తోడాయెను
మనలో కొలువైన దేవుని పూజింతుము
లోకమంతట క్రీస్తుప్రేమను ఘనముగ చాటెదము \\కోరస్\\