తరాతరాల చీకటి చీల్చుకొని | Taratarala Cheekati Cheelchukoni | Latest Christian Christmas Song Lyrics Telugu 2024 | Christmas Song Lyrics Telugu | Download
తరాతరాల చీకటి చీల్చుకొని
తరాతరాల చీకటి చీల్చుకొని
చిరు వేకువకు జాడను చూపా (2)
పరమూనే విడచి ఈ పుడమిపై
అడుగు పెట్టినాడు జన పాలకుడు (2)
మన నజరేయుడు
సంబరమే సంతోషమే సంబరమే (2)
1. పాపపు కాడిని మోసేటి జనులను చూడగా
ఆ మహారాజే నీ కోసం
మాములు మనిషిగా మారేగా "2"
నీ పాప భారం మోసేడి గొర్రెపిల్లగా
తన ప్రజలకు రక్షణ విశ్రాంతి నివ్వగా "2"
((పరమూనే))
2. తండ్రి కి దూరముగా ఉన్న ప్రజలను చూడగా
కుమారుని స్థానమునే వీడి నీకై వచ్చేగా "2"
కోల్పోయిన స్వస్థ్యం తిరిగి మనకివ్వను
దూరమైన తండ్రితో నిను ఏకం చేయును "2"
((పరమూనే))