యేసు పుట్టెను బెత్లెహేములోనా | Yesu Puttenu Bethlehemulona | Christmas Song Lyrics | Jesus Song Lyrics | Download
యేసు పుట్టెను బెత్లెహేములోనా
యేసు పుట్టెను బెత్లెహేములోనా
బహు సందడాయేను సకల జనులలోనా
యేసు పుట్టెను బెత్లెహేములోనా
ప్రతి గుండె మురిసెను చిన్ని క్రీస్తులోనా
ఆనందం సంతోషం ఉప్పొంగేనే
ఉల్లాసం ఉత్సాహం విరభూసేనే (2)
గొల్లల వేడుకతో
జ్ఞానుల రాకతో
విరజిల్లే పరిమళమే ఇది పండుగ పరవశమే (2)
ఆకాశ మార్గాన మెరిసింది తారా
జనులంతా ఈ వింతా చూచెను కనులారా
భువినేలు దివి రాజు దిగివచ్చిన వేళా
పులకించే ప్రతి హృదయం క్రిస్తేసుని చూడా
జ్ఞానులొచ్చెను తార దారి చూపెను
దీనుడైన దైవ సుతుని గాంచెను
మోకరించెను సాగిలపడి మ్రొక్కేను
సామ్రాణి బొలములర్పించేను బొలము
తల్లి మరియ కంటినిండా యేసు దివ్య రూపు నిండా
దూతలన్ని పాట పాడెను
మహిలో దైవ సుతున్ని మహిమ పరిచెను (2)
ప్రేమించే దేవుడు ఈ లోకాన్ని అంట
పంపించే తన తనయుని మన కోసమేనంట
ప్రాణాలే ఇచ్చేటి ప్రేమే తనదంట
విడిపించి నడిపింప ఇల వచ్చేనంట
లేత మొక్కల నులి లేత బుగ్గల
వరదైవ చిరుదివ్య రూపుడు
లోక పాపముల్ మోసుకొని పోయేడి
దేవుని గొర్రె పిల్ల ఈతడు
మనుషుల పోలికగా దాసుని రూపములో
రీక్తునిగా భువికి వచ్చెను
భువికి రక్షణగా తేజరిల్లెను (2)