యేసయ్యా నా ప్రాణమా | Yesayya naa praanamaa | Hosanna Ministries New Christian Song 2025 | Jesus Song Lyrics Telugu | Download

Yesayya naa praanamaa, Hosanna Ministries, Telugu Christian songs, devotional songs, Jesus worship, Christian music, Telugu worship songs, Yesayya songs, Hosanna songs, Telugu gospel songs, Jesus devotional, faith songs, spiritual songs, Telugu Jesus songs, Christian blog, Yesu songs, Telugu worship music, Hosanna Ministries albums, Jesus songs in Telugu, Telugu faith music, popular Christian songs

యేసయ్యా నా ప్రాణమా

యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా (2)

అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే

నను నీడగా వెంటాడెను - నే ఆలయక నడిపించెను

నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన

నా స్నేహమా - సంక్షేమమా - నీవే ఆరాధ్యుడా


చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని

నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని

ఆనందగానము నే పాడనా (2)

ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే (2)

సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతికున్నది నీ కోసమే (2)


జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని

జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని

ఉత్సాహగానము నే పాడనా (2)

ఏదైనా నీ కొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీ శక్తిని (2)

ఇదియే చాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా (2)


మధురము కాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం

మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం

స్తోత్రగీతముగా నే పాడనా (2) 

నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా (2)

స్తుతుల సింహాసనం నీ కొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా (2)


స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన

ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా


thank you hosanna, hosanna song lyrics, latest jesus song lyrics hosanna