Na Thoduga Unnavadave | నా తోడుగా ఉన్నవాడవే | Telugu Christian Song Lyrics
నా తోడుగా ఉన్నవాడవే | Na Thoduga Unnavadave | Telugu Christian Song Lyrics | Download
నా తోడుగా ఉన్నవాడవే
పల్లవి :
నా తోడుగా ఉన్నవాడవే
నా చేయి పట్టి నడుపు వాడవే ..//2//
నా పక్షమున నిలుచువాడవే ...//2//
నా ధైర్యము నీవే యేసయ్యా .....//2//
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా .....//2//
||నా తోడుగా||
1.
నా అను వారు నాకు దూరమైనా
నా తల్లిదండ్రులే నా చేయి విడచినా ..//2//
ఏ క్షణమైనా నన్ను మరవకుండా .....//2//
నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే ..//2//
||నా తోడుగా||
2.
నా పాదములు జారినావేళ
నీ కృపతో నన్ను ఆదుకుంటివే ...//2//
నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి ...//2//
నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే
||నా తోడుగా||
3.
హృదయము పగిలి వేదనలోన
కన్నీరు పొంగే పరిస్థితిలో ..//2//
ఒడిలో చేర్చి ఓదార్చువాడ ....//2//
కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే //2//
||నా తోడుగా||

Comments
Post a Comment