నీ కృపాతిశయమును | Nee krupatishayamu | Telugu Christian Song Lyrics | Jesus Song Lyrics Telugu | Download

Nee Krupatishayamu Telugu Song Lyrics, Neeku Krupatishayamu Christian Song Lyrics, Telugu Christian Worship Song Lyrics, Nee Krupatishayamu Song Meaning, Christian Songs Telugu Lyrics, Nee Krupatishayamu Lyrics in Telugu, Telugu Christian Praise Songs, Krupatishayamu Telugu Christian Worship, Nee Krupatishayamu Song Lyrics Telugu, Telugu Worship Songs Lyrics, Christian Song Nee Krupatishayamu, Telugu Christian Song Praise and Worship Lyrics, Christian Devotional Songs Telugu Lyrics, Nee Krupatishayamu Full Lyrics, Telugu Church Worship Songs Lyrics

నీ కృపాతిశయమును

నీ కృపాతిశయమును అనునిత్యము

నే కీర్తించెదా తరతరములకు

నీ విశ్వాస్యతను నే ప్రచురింతును


నీ కృపా నీ కృపా ఆకాశముకంటే హెచ్చైనది

మౌనిగా యెటులుండెదా సాక్షిగా ప్రచురించకా

నా తుది శ్వాస వరకు నీ చెంత చేరేవరకు


ఇంకా బ్రతికి ఉన్నామంటే – కేవలము నీ కృపా

ఇంకా సేవలో ఉన్నామంటే – కేవలము నీ కృపా

ఏ మంచితనము – లేకున్ననూ కొనసాగించినది 

నీ కృపా నిలబెట్టుకొన్నది నీ కృపా ||నీ కృపా||


పది తరములుగా వెంటాడిన – మోయాబు శాపము

నీ కృపను శరణు వేడగా – మార్చేనే వెయ్యి తరములు

అన్యురాలైన ఆ రూతును – ధన్యురాలుగా మార్చినది

నీ కృపయే నన్ను దీవించగా

ఏ శాపము నాపై పనిచేయదు ||నీ కృపా||


ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే – కేవలము నీ కృపా

మెతుకు బ్రతుకు ఉన్నాయంటే – కేవలము నీ కృపా

కృపతోనే రక్షణనిచ్చావు – నా క్రియల వలన కానే కాదు

జీవితమంతా ఋణస్థుడను

నీయందే నిత్యము అతిశయము ||నీ కృపా||


ఇల్లు వాహనం ఉన్నాయంటే – నీదు కృపాదానమే

బలము ధనము ఉన్నాయంటే – నీదు కృపా దానమే

ఏ అర్హత నాలో లేకున్ననూ – కృపా భిక్షయే నా యెడల

జీవితమంతా కృతజ్ఞుడను

జీవితమంతా పాడెదను ||నీ కృపా||


ప్రియులే నన్ను విడనాడినా – శోకమే నా లోకమా

అనాధగానే మిగిలానే – నా కథ ముగిసినదే

నీ కుడిచేతిలో ఉంచగనే – బెన్యామీను వంతుగా మారే

ఐదంతలాయే నా భాగ్యము

విధిరాతనే మార్చెనే నీ కృపా ||నీ కృపా||