ఏకాంతస్థలము కోరుము | Yekaantha Sthalamu | Bible Mission Song Lyrics | Telugu Christian Song Lyrics | Download Song Lyrics

Yekaantha Sthalamu Lyrics, ఏకాంతస్థలము కోరుము పాట, Telugu Christian Song, Christian devotional songs in Telugu, Spiritual solitude Telugu song, Telugu worship songs, Yekaantha Sthalamu Telugu Christian song, Telugu praise and worship songs, Solitude in Christian songs, Christian devotional music Telugu, Song lyrics for prayer and solitude Telugu, Telugu Christian hymns, Telugu songs for spiritual reflection, Christian meditation song Telugu, Telugu Christian song about peace

ఏకాంతస్థలము కోరుము

ఏకాంతస్థలము కోరుము – దేవుని ప్రార్ధింప –

ఏకాంత స్థలము చేరుము ఏకాంత స్థలము చేరి –

మోకాళ్ళ మీదవుండి లోకాశలను మదికి రాకుండ చూచుకొనుము || ఏకాంత ||


ఊహలోని పాపములను - ఒప్పుకొనుము తండ్రి యెదుట

దేహము లోకలకవియె - దిగును నిన్ను బాధ పెట్టును || ఏకాంత ||


మాటలందలి పాపములను - మన్నించుమని వేడుకొనుము

ఆటపాటలందు మాట - లాడుటయు నేరంబులగును || ఏకాంత ||


పాపక్రియలు అతి దుఃఖముతో - ప్రభుని యెదుట ఒప్పుకొనుము

పాపము మరల చేయనట్టి - ప్రయత్నంబుల్‌ చేయవలెను || ఏకాంత ||


నిన్ను మరల సిలువవేసి - యున్న పాప జీవినయ్యో

నన్ను క్షమియించుమని యన్న - నరులు మారువారు || ఏకాంత ||


చెడుగుమాని మంచి పనులు - చేయకున్న పాపమగును

పడియు లేవకున్న గొప్ప - పాపమగును పాపమగును || ఏకాంత ||


దేవా! నాకు కనబడుమన్న - దేవ దర్శనమగును నీకు

పావనంబగు రూపము చూచి - బహుగా సంతోషించగలవు || ఏకాంత ||


దేవా! మాటలాడుమన్న - దేవ వాక్కు వినబడు నీకు

నీవు అడిగిన ప్రశ్నలకెల్ల - నిజము తెలియనగును నీకు || ఏకాంత ||


ఎప్పుడు చెడుగు నీలోనికి - ఎగిరి వచ్చునో అప్పుడే

అప్పుడే నరక మార్గమందు - అడుగు బ్టెిన వాడవగుదువు || ఏకాంత ||


కష్టాల మేఘముల వెనుక - కలడు నీతి సూర్యుడు క్రీస్తు

దృష్టించు చున్నాడు నిన్ను - దిగులుపడకు దిగులుపడకు || ఏకాంత ||


నరలోక పాపాలు చూడు - నరకమునకు నిను దిగలాగు

పరలోకము వైపు చూడు - పైకి నిన్ను ఎత్తుచుండు || ఏకాంత ||