మెరిసేటి తారలా నను వెలిగించు | Meriseti Tarala Nanu Veliginchu | Telugu Christian Song Lyrics | Youtube Song Lyrics
మెరిసేటి తారలా నను
మెరిసేటి తారలా నను వెలిగించు
కురిసేటి జల్లులా నను దీవించు
నా ఊపిరివై నా జీవితమై
నా ఊపిరివై నా జీవితమై
నా ప్రాణ స్నేహమై నా రక్షకుడై
1. నీ కనులే నా మనసే తేరిచూడగా
నాలోనా ఏ మంచి కానరాదుగా
నీ కృపలో నా గతమే చూడలేదుగా
సరిచేసి నడిపించు నీదు సాక్షిగా
నీతి సూర్యుడా, నాదు యేసయ్య
జీవితాంతము, జాలి చూపవా
నా ప్రాణ స్నేహమై - నా రక్షకుడై
2. నీ మమతే తీయనిదీ మారదెన్నడు
లాలించే నీ ప్రేమ వీడదెన్నడు
ఊహలకే అందనిది నీదు కార్యము
నీ మాటే నాలోన నిండు ధైర్యము
సర్వశక్తుడా నాదు యేసయ్య
ఆశ్రయించగా ఆదరించవా
నా ప్రాణ స్నేహమై - నా రక్షకుడై