ఇదిగో నా జీవితం దేవా Lyrics – Idigo Naa Jeevitam Deva Telugu Christian Song
ఇదిగో నా జీవితం దేవా తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం Lyrics
ఇదిగో నా జీవితం దేవా నీ కంకితం
బ్రతుకైనా చావైనా నీ కోసమే
నాకున్నది నీ ఒక్కడివే
నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా
ఆరాధింతును నా పూర్ణ హృదయముతో
నిను ఘనపరతును నా జీవితాంతము
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నీవైపే నే చూడక - నీ ప్రేమే నేనెరుగక
శిధిలమైన శిలనై నేనుండగా
నను ప్రేమింపగా వెంటాడితివి
నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి
ఎన్నాళ్ళుగ నాకై వేచి యున్నావు
ఎందుకని ఇంత ప్రేమించితివి
దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము
పరిమళించు పద్మము నీవేనయ్యా
ఊహలరేఖలకు ఊపిరి పోసితివి
ఊహకు మించిన స్థానము నిచ్చితివి
ఏమి చూచితివి యోగ్యత నాలో
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చెదను
స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధతలో మహనీయుడా
స్వరమండలము సితారతో నిను కీర్తింతును
సద్గుణములకు నిలయము నీవే
సర్వాధిపతులకు సారధి నీవే
దైవములనబడిన వారికి నీవే
దేవుడవు మహాదేవుడవు
