స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ (Stuthi Keerthaneeyuda Ghanamaina Nee Prema) Lyrics
Stuthi Keerthaneeyuda Ghanamaina Nee Prema Telugu Christian worship song lyrics image

స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ
నా హృదయ వీణపై శృతిచేసి పాడనా
నా యేసురాజా అనురాగ బంధమా
నన్ను విడవలేని ఆత్మ అనుబంధమా (2)

చరణం 1
నా ప్రియ నేస్తమా నా ప్రాణ బంధమా
నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఆదరించుమా (2)
నీ సిలువ త్యాగం నేనెలా మరిచిపోదును
ఇలలోన నీకై సాక్షిగా జీవింతును (2)
(నా యేసు రాజా)

చరణం 2
నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా
నీ వెలుగు జాడలలో నిను వెంబడించిగా (2)
నీ జీవ వాక్యం నింపినే నాలో ధైర్యము
ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం (2)
(నా యేసు రాజా)

చరణం 3
మహిమ సింహాసనం నే చేరాలనే
నే కన్న కలలన్నీ నిజమైన వేళలో (2)
నా జయము నీవై నిలిచినా శ్రేష్ట తరుణాన
నీలోనే లీనమై పోదునే నే నిరంతరము (2)
(నా యేసు రాజా)