ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు | Elo Elo Antu Vacharandi Gollalu Song With Lyrics Telugu
ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు
ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు
సంతోషాలే పొంగేనండీ హైలెస్సా
దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండీ - హైలెస్సా
అంధకారాన్ని తొలగించే మహనీయుడు
పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు
నిన్నే కోరి నిన్నే చేరి
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు
1. లోకాలనేలేటి రారాజురా - ఉదయించే సూరీడై వచ్చాడురా
ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా (2)
దూతాళి పాడి - కొలిచారు చూడు
ఘనమైన ఒక వేడుక
ఆ గొల్లలేగా - దరువేసే చూడు
మెస్సయ్య - పుట్టాడనీ
మన మెస్సయ్య - పుట్టాడనీ
2. వెన్నెల్లో పూసింది ఓ సందడీ - పలికింది ఊరంతా ఈ సంగతీ
ఈ దీనుడంట - పసిబాలుడంట - వెలిసాడు మహరాజుగా (2)
మనసున్న వాడు - దయ చూపువాడు
అలనాటి అనుబంధమే
కనులారా చూడు- మనసారా వేడు
దిగి వచ్చే మనకోసమే
ఇల దిగి వచ్చే మనకోసమే
3. ఆ నింగి తారల్లా వెలగాలిరా జగమంత చూసేలా బ్రతకాలిరా
వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా (2)
సలిగాలి రాత్రి -పిలిసింది సూడు
మనలోన ఒక పండగ
భయమేల నీకు- దిగులేల నీకు
యేసయ్య మనకుండగా
మన యేసయ్య మనకుండగా