పాపమెరుగనట్టి ప్రభుని | Papameruganatti Prabhuni | Telugu Christian lent Song Lyrics | Bible Mission

Papamerunatti Prabhuni | పాపమెరుగనట్టి ప్రభుని | Telugu Christian lent Song Lyrics | Bible Mission

పాపమెరుగనట్టి ప్రభుని

    పాపమెరుగనట్టి ప్రభుని - బాధపెట్టిరి = 

    శాప వాక్యములను బల్కి శ్రమలు బెట్టిరి 

1. దరికి వచ్చువారిజూచి - దాగడాయెను = వెరువకుండవెళ్ళి తన్ను - 

    వెల్లడించెను (( పాప )) 

2. నిరపరాధియైన తండ్రిని - నిలువబెట్టిరి = దొరతనము వారియెదుట 

    పరిహసించిరి (( పాప )) 

3. తిట్టినను మరల వారిని - తిట్టడాయెను = కొట్టినను మరల వారిని 

    కొట్టడాయెను (( పాప )) 

4. తన్ను జంపు జనుల యెడల - దయనుజూపెను = చెన్నుగ - 

    దొంగను రక్షింప - చేయిచాపెను (( పాప )) 

5. కాలువలుగా రక్తమెల్ల - గారుచుండెను = పాలకుండౌ యేసు జాలి - 

    బారుచుండెను (( పాప ))