యేసుక్రీస్తుని సిలువ | yaesukreestuni siluva | Telugu Christian Lent Song Lyrics | Bible Mission
యేసుక్రీస్తుని సిలువ
యేసుక్రీస్తుని సిలువ - ఎపుడు ధ్యానము చేయు
మాసతోను సోదరా = మనదోసంబు నెడబాపు - ఈ
సంతాప మరణ - వ్యాసంబుచే సోదరా
1. ధీరుండై ధీనుండై - ధారుణ్య పాపభారంబు
మోసెను సోదరా = తన్ను - జేరినవారిని -
పారదోలనని - ఎవరు బల్కిరి సోదరా
(( యేసు ))
2. ఎండచే గాయములు - మండుచునుండెను -
నిండు వేదన సోదరా = గుండె - నుండి నీరుకారు -
చుండె దుఃఖించుచు - నుండు వేళను సోదరా
(( యేసు ))
3. ఒళ్ళంత రక్తము - ముళ్ళ కిరీటము - తలపై బెట్టిరి
సోదరా = ఒకడు బళ్ళెంబుతో బొడవ - నీళ్ళు
రక్తము గారె - చిల్లులాయెను సోదరా
(( యేసు ))
4. కటకటా - పాపసంకటము - బాపుట కింత
ఎటులోర్చితివి సోదరా = ఎంతో
కఠినహ్రదయంబైన - అటుజూచి తరచినా
కరిగిపోవును సోదరా
(( యేసు ))
5. పంచగాయములు - నేనెంచి తలంచినా
వంచనయిది సోదరా = నన్ను వంచించు సైతాను -
వలనుండి గావ - తానెంచి బొందెను సోదరా
(( యేసు ))
6. మరణమై నప్పుడు - ధరణి వణికెను గుడి - తెర
చినిగెను సోదరా = ఊరు గిరులు బండలు బద్ద -
లాయె సమాధులు - తెరువబడెను సోదరా
(( యేసు ))