ఇంతకాలం నీ కృపలో | Inthakalam Nee Krupalo | Telugu Christian Song Lyrics | Download
ఇంతకాలం నీ కృపలో
ఇంతకాలం నీ కృపలో - కాచినావు మా దేవా (2)
తల్లిలాగా తండ్రిలాగా - నీ కౌగిలో దాచినావు (2)
మా ప్రాణ ప్రియుడా మా యేసయ్య
స్తుతిపాడెదం మా జీవితమంతా (2) (ఇంతకాలం)
1. కష్టాలలోన నష్టాలలోన
నడిపించినావు చేయివిడువక
శోధనలోన క్రుంగియున్న సమయమున
లేవనెత్తి మమ్ము నిలబెట్టిన దేవ
మా చేతిలో నీ చేయివేసినావు
చక్కనైన త్రోవలో సాగిపోమ్మన్నావు...(2)
నేనున్నానని వాగ్దానమిచ్చావు (2) (మా ప్రాణ)
2. మా స్థితి గతులన్నీ ఎరిగియున్నవాడవు
క్షణమైనా ఏనాడూ యెడ బాయని దేవా
మా రక్షణ కర్తవై మా చెంత నిలిచావు
నీ పిల్లలమైన మమ్ము కాపాడుము దేవా
పిలచిన మరు క్షణమే పలుకరించువాడవే
సజీవుడవైన దేవా ఉన్నవాడవే (2)
మా స్తుతికి పాత్రుడా వందనాలయ్య (2) (మా ప్రాణ)