తనువు నా దిదిగో గై | Thanuvu Naa Didigo | Telugu Christian Song Lyrics | Andra Kristhava Keerthanalu

telugu christian songs,latest telugu christian songs,christian songs,christian telugu songs,telugu christian song,andhra kristhava keerthanalu,jesus telugu songs,jesus songs telugu,christian telugu america,telugu christian paatalu,telugu jesus songs,non stop christian songs,christian telugu nj,christian telugu usa,christian telugu choir,andhra kraisthava keerthanalu,christian worship telugu,christian songs 2020,christian telugu messages,christian

తనువు నా దిదిగో గై

తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీ 
దినములు క్షణములు – దీసికొని యవి నీదు 
వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ      ||తనువు|| 

ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగో 
యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు 
దనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో      ||తనువు|| 

స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడనిమ్ము 
మరియు పెదవు లివిగో – మహనీయమైన నీ 
పరిశుద్ధ వార్తతో – పరి పూర్ణముగా నింపు      ||తనువు|| 

వెండి పసిడి యివిగో – వీస మైనను నాకై – యుండవలె నని కోరను 
నిండైన నీ యిష్ట – నియమంబు చొప్పున 
మెండుగా వాడ పరి – మితియవు జ్ఞానం బిదిగో      ||తనువు|| 

నా యిష్ట మిదిగో యిది – నీ యిషముగ జేయ – నా యిష్ట మిక గాదది 
నా యిఛ్చ యున్నట్టి – నా హృదయ మిదిగో 
నీ కే యియ్యది రాజ – కీయ సింహాసనామౌ      ||తనువు|| 

ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానమున నే – నెన్నడు ధార వోయన్ 
నన్ను నీ వానిగ – నాథా గైకొను మెపుడు 
చెన్నుగ నీ వశమై – స్థిర ముగ నుండెద      ||తనువు||