Posts

Showing posts with the label త

Tellavaarinaa Vela | తెల్లవారిన వేళ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.42 - ప్రాతః స్తవము తెల్లవారిన వేళ -దెలి వొంది మన క్రీస్తు -దివ్య నామమంబాడరే- యో ప్రియులారా-దివస రక్షణ వేండరే=తల్లి రొమ్మున దాచు-పిల్ల రీతిని మనల-జల్లదనముగ రాతి-రెల్లగాచిన విభుని ॥ దెల్లవారిన వేళ ॥ 1. నిద్రయిన వేళ - నిపోలాపదలబాపి-నిశ లన్ని గడుపు విభునిన్= భద్రముగ వినతించి- భయభక్తితో మనము-ముద్రి తాక్షులంగేలు- మోడ్చి మొక్కుచును ॥ దెల్లవారిన వేళ ॥ 2. భానుడుదయం బయ్యె-బద్మములు వికసిల్లె- గానములు జేసెంబక్షుల్=మానసాబ్జము లలర-మనము కల్వరి మెట్ట-పై నెక్కు నినుడనెడి-ప్రభుని జూచి వేండ్మన్ ॥ దెల్లవారిన వేళ ॥ 3. దిట్టముగ ఆ మానేసం-ద్రియ కాయ శోధనలు-పట్టుకొని యుందు దినమున=దట్టముగ మన నాల్గు-తల్ల యేసుని కరుణ-జుట్టుకొని రక్షించు-శుభ మడుగుకొనుచున్ ॥ దెల్లవారిన వేళ ॥ 4. పాపభారము మనము-ప్రభుని పై నిడి గురుని-పాదముల చెంత నారగి= కాచు కర్త విశాల- కరము మాటున డాగి -యాపదలం దోలగించు-మని వేండుకొనుచున్ ॥ దెల్లవారిన వేళ ॥ ––పురుషోత్తమ చౌధరి Tellavaarinaa veela -deli vondi mana Kreesthu -divya naamambaadare- Yo priyulaaraa-divasa rakshana veendaree=t...

Thrithvamai Nithyathvamuna | త్రిత్వమై నిత్యత్వమున | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.21 - త్రిత్వమునకు స్తుతి త్రిత్వమై నిత్యత్వమున నే-కత్వమగు దేవా-నీ =సత్య సామర్థ్యత్వముల నిజ-తత్వము గణించి నిను- నిత్యము స్తుతించెదను ॥ త్రిత్వమై ॥ 1. ఎల్లలోకంబులు సృజించిన-చల్లని తండ్రి-నా=యుల్లమున నీ గొప్ప వింత- లెల్ల సంతసిల్ల శో- భిల్లం దలంచెదను ॥ త్రిత్వమై ॥ 2. వాసి కెక్కిన పరమరాజ్య ని-వాసమును విడిన-శ్రీ=యేసు నాధుండను కుమారా- దోషుల దోసంబులెల్లం-గాచి రక్షించినావు ॥ త్రిత్వమై ॥ 3. ఆదరణకారుండ- వగు శు-ద్ధాత్ముడా దేవా- యా= మోద నామము నంపంబడి యేసు -నాధుని సుబోధ లెల్ల-బోధపరచి పాదుకొల్పు ॥ త్రిత్వమై ॥ 4. సుతా శుద్ధాత్మ- ఒక్కదేవుండవు -ఎల్ల= పాపులను రక్షింప మిగుల-నోపికతో నాపదలు-బాపి కృపంజూపినావు ॥ త్రిత్వమై ॥ Thrithvamai nithyathvamuna ne-kathvamagu deevaa-nee =sathya saamarthyathvamula Nija-thathvamu ganinchi ninu- nithyamu sthuthinchedanu || Thrithvamai || 1. Ellalokambulu srujinchina-challani thandri-naa=yullamuna nee Goppa vintha- lella santhasilla sho- bhillam dalanchedanu || Thrithvamai || 2. Vaasi kekkina paramaraajya ni-v...

Toorpu Deshapu Gnanulamu | తూర్పు దేశపు జ్ఞానులము | Telugu Christmas Song Lyrics

Image
తూర్పు దేశపు జ్ఞానులము | Toorpu Deshapu Gnanulamu | Telugu Christmas Song Lyrics | Jesus Song Lyrics Telugu | Download తూర్పు దేశపు జ్ఞానులము తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి /2/ కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి /2/ ఓ … రాత్రి వింత తారహో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్ నేనర్పింతు బంగారము నీవంగీకరించు ప్రభో /2/ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు ఓ … రాత్రి వింత తారహో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్ నేనర్పింతు సాంబ్రాణి నీవంగీకరించు ప్రభో /2/ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు ఓ … రాత్రి వింత తారహో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్ నేనర్పింతు బోళమును నీవంగీకరించు ప్రభో /2/ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు ఓ … రాత్రి వింత తారహో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్ తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి /2/ కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి /2/ ఓ … రాత్రి వింత తారహో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్

Toorpu Dikku Chukka Butte | తూర్పు దిక్కు చుక్క బుట్టె | Christmas Song Lyrics Telugu

Image
తూర్పు దిక్కు చుక్క బుట్టె | Toorpu Dikku Chukka Butte | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics Telugu | Download తూర్పు దిక్కు చుక్క బుట్టె తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా – ఓ మరియమ్మా ||2|| చుక్కను జూచి మేము వచ్చినాము మొక్కి పోవుటకు ||2|| ||తూర్పు దిక్కు|| బెత్లెహేము పురము లోని బాలుడమ్మా గొప్ప బాలుడమ్మా ||2|| మన పాపముల బాప పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా ||2|| ||తూర్పు దిక్కు|| పశువుల పాకలోని బాలుడమ్మా పాపరహితుడమ్మా ||2|| పాపంబు బాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా ||2|| ||తూర్పు దిక్కు|| బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము బాల యేసు నొద్దకు ||2|| బంగారు పాదముల మ్రొక్కెదము బహుగ పాడెదము ||2|| ||తూర్పు దిక్కు||

Tara Velisindi Aa Ningilo | తార వెలిసింది ఆ నింగిలో | Christmas Song Lyrics Telugu

Image
తార వెలిసింది ఆ నింగిలో | Tara Velisindi Aa Ningilo | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics | Download తార వెలిసింది ఆ నింగిలో తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2) రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని (2) ||తార|| మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే (2) సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార|| బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములే ఆ యింటిలో మా కంటితో నిను కనులారా గాంచాములే (2) మా ఇమ్మానుయేలువు నీవేనని నిను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిను ఘనపరచి పొగిడాములే ||తార||

Taratarala Cheekati Cheelchukoni | తరాతరాల చీకటి చీల్చుకొని | Latest Christian Christmas Song Lyrics

Image
తరాతరాల చీకటి చీల్చుకొని | Taratarala Cheekati Cheelchukoni | Latest Christian Christmas Song Lyrics Telugu 2024 | Christmas Song Lyrics Telugu | Download తరాతరాల చీకటి చీల్చుకొని తరాతరాల చీకటి చీల్చుకొని చిరు వేకువకు జాడను చూపా (2) పరమూనే విడచి ఈ పుడమిపై అడుగు పెట్టినాడు జన పాలకుడు  (2) మన నజరేయుడు సంబరమే సంతోషమే సంబరమే  (2) 1. పాపపు కాడిని మోసేటి జనులను చూడగా      ఆ మహారాజే నీ కోసం      మాములు మనిషిగా మారేగా "2"      నీ పాప భారం మోసేడి గొర్రెపిల్లగా      తన ప్రజలకు రక్షణ విశ్రాంతి నివ్వగా "2"                                                                 (( పరమూనే)) 2. తండ్రి కి దూరముగా ఉన్న ప్రజలను చూడగా    ...

Thanuvu Naa Didigo | తనువు నా దిదిగో గై | Telugu Christian Song Lyrics | Download

Image
తనువు నా దిదిగో గై | Thanuvu Naa Didigo | Telugu Christian Song Lyrics | Andra Kristhava Keerthanalu తనువు నా దిదిగో గై తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీ  దినములు క్షణములు – దీసికొని యవి నీదు  వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ      ||తనువు||  ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగో  యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు  దనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో      ||తనువు||  స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడనిమ్ము  మరియు పెదవు లివిగో – మహనీయమైన నీ  పరిశుద్ధ వార్తతో – పరి పూర్ణముగా నింపు      ||తనువు||  వెండి పసిడి యివిగో – వీస మైనను నాకై – యుండవలె నని కోరను  నిండైన నీ యిష్ట – నియమంబు చొప్పున  మెండుగా వాడ పరి – మితియవు జ్ఞానం బిదిగో      ||తనువు||  నా యిష్ట మిదిగో యిది – నీ యిషముగ జేయ – నా యిష్ట మిక గాదది  నా యిఛ్చ యున్నట్టి – నా హృదయ మిదిగో  నీ కే యియ్యది రాజ – కీయ సింహాసనామౌ    ...

Tharatharaalalo Yugayugaalalo | తరతరాలలో యుగయుగాలలో | Telugu Christian Song Lyrics

Image
తరతరాలలో యుగయుగాలలో | Tharatharaalalo Yugayugaalalo | Telugu Christian Song Lyrics | Download తరతరాలలో యుగయుగాలలో తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో  దేవుడు దేవుడు యేసే దేవుడు  హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా  భూమిని పుట్టించకమునుపు  లోకము పునాది లేనపుడు    ||దేవుడు||  సృష్టికి శిల్పకారుడు  జగతికి ఆదిసంభూతుడు        ||దేవుడు||  తండ్రి కుమార ఆత్మయు  ఒకడైయున్న రూపము        ||దేవుడు||

Thallilaa Laalinchunu | తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును | Telugu Christian Song Lyrics

Image
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును | Thallilaa Laalinchunu | Telugu Christian Song Lyrics | Download      తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2)       ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును       చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా          ||తల్లిలా||  1. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను       చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను (2)       నీ పాదము తొట్రిల్లనీయను నేను       నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు       అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య            ||తల్లిలా||  2. పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ       వీడిపోదు నా కృప నీకు       నా నిబంధనా తొలగదు (2)       దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద       నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద       అని చెప్పి వాగ...

THANDRI DEVA THANDRI DEVA | తండ్రి దేవా తండ్రి దేవా | Telugu Christian Song Lyrics

Image
తండ్రి దేవా తండ్రి దేవా | THANDRI DEVA THANDRI DEVA | Telugu Christian Song Lyrics | Download తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా      తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా       నీవుంటే నాకు చాలు (2)        నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్       నా జీవమా నా స్నేహమా నిన్ అరాధించెదన్ (2)   1. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా       నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా  (2)        తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)   2. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే       జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా (2)        తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)

Thriyeka devudaina yehovanu | త్రియేక దేవుడైన యెహోవాను | Telugu Christian Songs

Image
త్రియేక దేవుడైన యెహోవాను | Thriyeka devudaina yehovanu | Telugu Christian Songs | Download త్రియేక దేవుడైన యెహోవాను      త్రియేక దేవుడైన యెహోవాను       కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు       పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని       గాన ప్రతి గానములు చేయుచు ఉండును  1. నా శాపము బాపిన రక్షణతో       నా రోగాల పర్వము ముగిసేనే       వైద్య శాస్త్రములు గ్రహించలేని       ఆశ్చర్యములెన్నో చేసినావే || త్రియేక ||   2. నా నిర్జీవ క్రియలను రూపు మాపిన       పరిశుద్ధాత్మలో ఫలించెదనే       మేఘ మధనములు చేయలేని       దీవెన వర్షము కురిపించినావే || త్రియేక ||   3. నా స్థితిని మార్చిన స్తుతులతో       నా హృదయము పొంగిపొర్లేనే       జలాశయములు భరించలేని       జలప్రళయములను స్తుతి ఆపెనే  || త్రియేక ||

Thambura Sithara | తంబుర సితార నాదముతో | Telugu Christian Song Lyrics

Image
తంబుర సితార నాదముతో | Thambura Sithara | Telugu Christian Song Lyrics | Download తంబుర సితార నాదముతో      తంబుర సితార నాదముతో       క్రీస్తును వేడగ రారండి       ఇద్దరు ముగ్గురు కూడిన చోట       ఉంటాననిన స్వామికే (2)        ||తంబుర||   1. పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని       పాపుల పంక్తిని కూర్చొని (2)        విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే  ||తంబుర||   2. ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి       నీ శోధనలను సమిధలుగా (2)        నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా ||తంబుర||