శుద్ధి శుద్ధి శుద్ధి | Shudhdhi Shudhdhi Shudhdhi | Telugu Christian Song Lyrics | Download
శుద్ధి, శుద్ధి, శుద్ధి!
శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు
ప్రాతఃకాలస్తుతి నీకీ చెల్లింతుము
శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా!
ముగ్గురైయుండు దైవత్ర్యేకుడా!
శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందు
బరవాసు లెల్ల నిన్నేశ్లాఘింతురు
శెరపుల్ ఖెరూబుల్ సాష్టంగపడి
నిత్యుడవైన నిన్ నుతింతురు
శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ
పాపి కన్ను చూడలేని మేఘ వాసివి
అద్వితీయప్రభు, నీవు మాత్రమేను
కరుణ, శక్తి, ప్రేమరూపివి.
శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు
సృష్టిజాలమంత నీ కీర్తిబాడును
శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవ
ముగ్గురైయుండు దైవత్ర్యేకుడా!