ఎన్నడు గాంచెదమో యేసుని | Yennadu Ganchedhamo Yesuni | Telugu Christian Song Lyrics | Download
ఎన్నడు గాంచెదమో యేసుని
ఎన్నడు గాంచెదమో యేసుని నెన్నడు గాంచెదమో యెన్నడు
జూతుము కన్నె కుమారుని సన్నుతి జేయుచును ||నెన్నడు||
1. అంధుల గాచె నట యెహోవా నందను డితడౌనట పొందుగ
బాపాత్ములకొర కై తన ప్రాణము విడిచెనట ||యెన్నడు||
2. వేసిరి సిలువనట క్రీస్తుని జేసిరి హేళనట డాసిరి యూదులట
బల్లెము దూసిరి ప్రక్కనట ||యెన్నడు||
3. చిందెను రక్తమఁట పరమ సంధులు దెల్పెనట నిందల కోర్చె న
ట మన దగు నేరము గాచెనట ||యెన్నడు||
4. ఆపద కోర్చెనట పాపపు మోపులు మోసెనట కోపము మాన్పెన
ట యెహోవా కొడుకై వెలసెనట ||యెన్నడు||
5. అక్షయు డితడెనట జగతికి రక్షకు డాయెనట దీక్షగ నమ్మిన
నరులం దరికి ని రీక్షణ దేవుడట ||యెన్నడు||