మహాత్ముడైన నా ప్రభు | Mahaathmudaina Naa Prabhu | Telugu Christian Jesus Song Lyrics | Download
మహాత్ముడైన నా ప్రభు
మహాత్ముడైన నా ప్రభు
విచిత్ర సిల్వ జూడ నా
యాస్తిన్ నష్టంబుగా నెంచి
గర్వం బణంగ ద్రొక్కుదున్
నీ సిల్వ గాక యో దేవా
దేనిన్ బ్రేమింప నీయకు
నాన్నాహరించు సర్వమున్
నీ సిల్వకై త్యజింతును
శిరంబు పాద హస్తముల్
సూచించు దుఃఖ ప్రేమలు
మరెన్నడైన గూడెనా
విషాద ప్రేమ లీ గతిన్?
ముండ్లన్ దుర్మార్గులల్లిన
కిరీట మేసు కుండినన్
ఈ భూ కిరీటములన్ని
దానం దూగంగ జాలు నే?
లోకంబు నే నేర్పించిన
నయోగ్యమైన యీవి యౌ
వింతైన యేసు ప్రేమకై
నా యావజ్జీవ మిత్తును
రక్షింప బడ్డ లోకమా
రక్షింప జావు బొందిన
రక్షకు-డేసు నిన్ సదా
రావంబు తోడ గొల్వుమా