యేసు జన్మించెన్ ఇలలో | Yesu janminchen ilalo | Telugu Christian Christmas Song | Bible Mission Song Lyrics | Download

Yesu janminchen ilalo lyrics, Telugu Christmas song lyrics, Christian Christmas songs in Telugu, Telugu Christmas carols, Jesus birth songs Telugu, Telugu gospel Christmas songs, Christmas praise songs Telugu, Christian worship songs Telugu, Christmas celebration songs in Telugu, Telugu Christmas Christian songs lyrics, Yesu janminchen ilalo song, Telugu Christmas devotional songs

SONG NO. 18

యేసు జన్మించెన్ ఇలలో

యేసు జన్మించెన్ ఇలలో - యేసు జన్మించెన్ - పాపుల

కొరకును శుద్ధులకొరకును - యేసు జన్మించెన్ =

ఈ సంతసమగు వర్తమానము - ఎల్ల జనుల వీనుల మ్రోగు గాక

- విభునకు స్తోత్రము    || యేసు ||


1. లోకము కొరకును నాకై నీకై ఆ కాలమునకై - ఈ కాలమునకై -

    లోకరక్షకుడగు యేసుడు బుట్టెను - ఆ కైసరౌగుస్తు అరయలేదు

    ప్రభున్ = ఇది ఆశ్చర్యము - ఎంతో విచారము - ఏల నతడు ప్రభు

    - నెరుగకపోయెనో    || యేసు ||


2. భూజనాంగములకై నాకై నీకై - రాజులకై హే - రోదు రాజు

    కొరకై - రాజగు యేసుడు - రంజిల్ల బుట్టెను - రాజగు హేరోదు

    ప్రభువు నరయలేదు = ఇది ఆశ్చర్యము - ఎంతో విచారము -

    యేల నతడు ప్రభు - నెరుగక పోయెనో    || యేసు ||


3. సర్వ లోకమునకై నాకై నీకై - సర్వ వేదజ్ఞులౌ - శాస్త్రుల కొరకై -

    ఉర్విని యేసుడు - ఉద్భవించెను - గర్వపు శాస్త్రులు ప్రభువు

    నరయలేదు = ఇది ఆశ్చర్యము - ఎంతో విచారము యేల వారు

    ప్రభు - నెరుగకపోయిరో    || యేసు ||


4. నీవనుకొను ప్రతివానికై నాకై నీకై - దేవార్చకులకై - శాస్త్రుల

    కొరకై - దేవనందనుడీ భువిలో బుట్టెను - ఈ వార్త చూసి వారు - ప్రభుని

    పూజింప లేదు = ఇది ఆశ్చర్యము - ఎంతో విచారము - యేల వారు ప్రభు

    - నెరుగక పోయిరో    || యేసు ||


5. ఆ ప్రాంతపు వారికి జ్ఞానులకు - ఈ ప్రభుజన్మ సు - వార్త విన

    బడియె - భూ ప్రజలీ వార్త - గ్రహియింపలేదాయె - అ ప్రజలకు చూచు -

    నాశయే లేదాయె = ఇది ఆశ్చర్యము - ఎంతో విచారము - ఎందులకీ

    వార్త - యెరుగక పోయిరో    || యేసు ||


6. సకల మతస్థుల కొరకై నాకై - సుఖముగా జీవించు - నీ కొరకై ప్రభు

    సుఖమును త్యజియించి - సుతుడై పుట్టెను - సకల మతస్థులు - స్వామి

    నెరుగలేదు = ఇది ఆశ్చర్యము ఎంత విచారము - యేల వారు ప్రభు

    నెరుగక పోయిరో    || యేసు ||


7. అన్ని పల్లెలకై పట్టణములకై - కన్నబిడ్డలమగు - నాకై నీకై

    చిన్న కుమారుడై - శ్రీ యేసు బుట్టెను - అన్నిచోట్లకిపుడీ - వార్త

    తెలియుచుండెన్ = ఇది ఆశ్చర్యము - ఎంతో సంతోషము -

    ఇట్లు వ్యాపింపజేయు - దేవునికి స్తోత్రము    || యేసు ||