పంక్తిలోకి రండి క్రిస్మసు పంక్తిలోకి | Panktuloki randi Krismasu panktuloki | Telugu Christian Christmas Song Lyrics | Bible Mission Christmas Song Lyrics | Download

Panktuloki randi Krismasu panktuloki lyrics, Telugu Christmas song lyrics, Christian Christmas songs Telugu, Christmas worship songs in Telugu, Telugu carols, Telugu Christmas songs, Jesus birth songs Telugu, Christian songs for Christmas, Christmas praise songs Telugu, Telugu gospel Christmas songs, Christmas Telugu Christian lyrics, Christmas celebration songs Telugu

SONG NO. 17

పంక్తిలోకి రండి క్రిస్మసు పంక్తిలోకి

పంక్తిలోకి రండి - క్రిస్మసు పంక్తిలోకి రండి

క్రిస్మసు పంక్తిలోకి రండి    || పంక్తి ||


1. ఎరుకపరుపలెండి - క్రిస్మసు నెరుక పరుపలెండి - క్రిస్మసు

    నెరుక పరుపలెండి = వెరువకుడి శుభ - వార్త యిదియం

    దర కానంద - కరమైనది మీ కొరకై రక్ష - కుండు బుట్టెనని

    = ఎరిగించిన గబ్రి - యేలు దూత    || పంక్తి ||


2. మహిమ పరుప రండి - దేవుని మహిమ పరుప రండి - దేవుని

    మహిమ పరుప రండి = మహికిన్ దేవ కు - మారుడు వచ్చిన

    మహిమకార్య స - న్మానార్ధంబై - మహిమ సంభవ - మగు దేవునికిని

    = మహిమగ పలికిన - మహిమ దూతల    || పంక్తి ||


3. దేవ ప్రియులగుడి - క్రిస్మస్ దేవ ప్రియులగుడి - క్రిస్మస్

    దేవ ప్రియులగుడి = దేవుని కిష్టులౌ వారలకు

    ఈ వసుధను లభి - యించును శాంతి

    ఈ విధముగా వచి - యించిన బుధజన

    = సేవకాళియగు - దేవదూతల    || పంక్తి ||


4. మనసున జూడండి - బాలుని - మనసునజూడండి - బాలుని

    మనసున జూడండి = జనన వార్తను వినిన వెంటనే

    మనసున భీతి - యణగిన వారై

    మనసానందం - బును గలవారై

    = చని శిశువును చూ - చిన గొల్లల    || పంక్తి ||


5. చేకొనుడి వార్త - భద్రము - చేసికొనుడి వార్త - భద్రము

    చేసి కొనుడివార్త = ఆ కాపరుల - యన్ని మాటలు

    స్వీకరించి మది - చింతనచేయుచు

    శ్రీకర జన్మ వి - శేషంబులు హృది

    = చేకొని భద్రము - చేసిన యామె    || పంక్తి ||


6. వింతగా చూడండి శిశువును - వింతగా చూడండి =

    అంత దేవుడు నరుడై వచ్చిన - వింతశిశువును - జూచుచు

    మదిని - సంతస మొందుచు - నిశ్శబ్దముగ

    = చెంతను గూర్చుండిన - యోసేపు    || పంక్తి ||


7. ఆరాధించండి - క్రీస్తును ఆరాధించండి - క్రీస్తును

    ఆరాధించండి = రారాజగు ని - శ్రాయేల్ రాజౌ

    ఈ రాజున్న - యింటికి చుక్క

    దారిచూపగా - జేరి మ్రొక్కుచు

    = ఆరాధించిన - తూరుపు జ్ఞానుల    || పంక్తి ||


8. మనకని నమ్మండి - క్రిస్మసు - మనకని నమ్మండి - క్రిస్మసు

    మనకని నమ్మండి = మనకై క్రీస్తు - మహిలో బుట్టెను

    గనుక కృతజ్ఞత - గనపరచుటకై

    మనసున బాహ్య - మున క్రిస్మసు

    = పనులు పూనుకొను - వారి సమాజ    || పంక్తి ||