క్రిస్మస్ అంటే ఆరాధనా | Christmas ante aaradhana | Telugu Christmas Song Lyrics 2024 | Youtube | Jesus Song Lyrics Telugu | Download
క్రిస్మస్ అంటే ఆరాధనా
క్రిస్మస్ అంటే ఆరాధనా... కార్యం చేసే ఆలాపనా
పరలోకంలో జరిగే ఆరాధన దూతలు చేసే స్తోత్రార్చన
యేసుని పుట్టుకతో భువికొచ్చెను
మనుజాళి అంతటికి ఆనందం షురువాయెను.....
పాపాలను తొలగించగా-శాపాలను ఎడబాపగా
ధివి నుండి భూవి కొచ్చే ఆ యేసుడే రాజ్యాలనేలే మహారాజుడే
మానవరూపునిగా జన్మించెను ప్రేమను పంచగా దిగివచ్చెను
ఆరాధన క్రిస్మస్ ఆరాధన సంతోషమే క్రీస్తులో సమాధానమే
1. అరణ్య ప్రాంతంలో ఆ ఎలిజబెత్తు
యేసుని రాకను చూచి పులకించెను (2)
మరియ గర్భాన యేసుని పసిగట్టి
గంతులు వేసెను గర్భస్థ యోహాను (2)
వీరంతా చేసిన ఆరాధన పరిశుద్ధ ఆత్మతో దీవించెను (2)
పరిశుద్ధ ఆత్మతో దీవించెను (ఆరాధన)
2. ఆ రాత్రి వేళలో మందల కాపరులు
యేసుని వార్త విని సంతషించిరి (2)
దేవదూతల ఆరాధనే చూసి
దేవదేవుని కనులార గాంచి (2)
కాపరులు చేసిన ఆరాధనతో ఊరువాడ పులకించెను (2)
ఊరువాడ పులకించెను (ఆరాధన)
3. ఆ తూర్పు దేశపు జ్ఞానులు
తారచేసే ఆరాధనను పసిగట్టి (2)
బంగారు సాంబ్రాణి బోళములర్పించి
తనివి తీరా ఏసుని వీక్షించి (2)
వారంతా చేసిన ఆరాధన మరణము నుండి తప్పించెను (2)
మరణము నుండి తప్పించెను (ఆరాధన)