నా జీవితానికి ఒక | Na jeevitaniki oka | Telugu Christian Song Lyrics | Song Lyrics Download
నా జీవితానికి ఒక
నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని
నా ..కోసమే ఒక చిత్తమే ఉన్నాధని (2)
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై (2)
ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే (నా జీవితానికీ)
సృష్టిలోనే సౌందర్యమైన అదియే వివాహ బంధము ...
కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము (2)
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
జీవము అను కృపావరములో ఒకరికొకరుగా జీవించాలి (2) (నా జీవితానికీ)
పానుపే పవిత్రమైన నిష్కళంకమైనది ...
జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు (2)
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
అది కళంకము ముడతలైనను మరి ఏదియు లేని ప్రేమ ఇది (2) (నా జీవితానికీ)
క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్య ను ప్రేమించవలెను ...
సంఘమూ లోబడినంతగా భార్య భర్త కు లోబడవలెను (2)
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై (2)
ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే (2) (నా జీవితానికీ)