నా యేసయ్య నా యేసయ్య – తెలుగు క్రైస్తవ గీతం లిరిక్స్ | Na Yesayya Na Yesayya Telugu Christian Song Lyrics
నా యేసయ్య నా యేసయ్య పాట లిరిక్స్
నా యేసయ్య నా యేసయ్య
నేను నీతో ఉండాలి
నీవు లేనిదే అర్థమే లేదు – ఈ జీవితానికి
యేసునాథ – యేసునాథ – నా దేవా
యేసునాథ – నా నాథ – నా ప్రభువా
నా యేసయ్య నా యేసయ్య
నాకు నీ ప్రేమ కావాలయ్యా
నా యేసయ్య నా యేసయ్య
నీతో నేనుండాలి
చరణం :- 1
నాలోని మొత్తం నీవే దేవా
నాలో సమస్తం నీకే ప్రభువా
నా గుండెలో – స్వరమా
నాలోని ప్రాణం – నీవే దేవా
నాకున్నదంతా – నీవే ప్రభువా
నీ ఆత్మతో – తాకుమా…….
నీకోసమే – వేచానులే
నా యేసయ్య – నను చేరవా
నీకోసమే – వేచానులే
నా యేసయ్య – దరి చేరవా
నీకోసమే నా జీవితం – నీకోసమే నా జీవనం
నీకోసమే నా………..సర్వం
నీకోసమే నా జీవితం – నీకోసమే నా జీవనం
నీకోసమే నా…….. సర్వం…..
( నా యేసయ్య )
చరణం :- 2
నీ చేతికింద నీడలోనే
కాయుమయ్య ప్రేమతోనే
కనుపాపల యేసయ్య
నా గుండెలోన దాచుకున్న
ప్రేమంతా మొత్తం నీదే నాన్న
నను హత్తుకో మెల్లగా
నా ధ్యానము నీకోసమే
నా ప్రాణమా నీ కోసమే
నా హృదయము నీకోసమే
నీ స్పర్సతో నను తాకవే
నీకోసమే నా ప్రార్ధన – నీకోసమే ఆలాపన
నీకోసమే నా………..తపన
నీకోసమే నా ప్రార్ధన – నీకోసమే ఆలాపన
నీకోసమే నా………..తపన
( నా యేసయ్య )
