అడిగే వాటికంటే ఊహించే వాటికంటే – Telugu Christian Song Lyrics | THANDRI SANNIDHI MINISTRIES
అడిగే వాటికంటే ఊహించే వాటికంటే
అడిగే వాటికంటే ఊహించే వాటికంటే
అధికముగా చేయగలవు యేసయ్యా
నన్ను నడిపే సారధివి నీవేనయ్యా (2)
(నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా)
"అడిగే"
చరణం 1:
చేసి ఉన్న ప్రార్ధన నేను మరచిపోయినా
నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా (2)
అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన (2)
పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన (2)
"అధికముగా"
చరణం 2:
అల్పమైన వాటిని ఆశించును నా హృదయం
అధికమైన మేళ్ళనూ దాచును నీ మంచితనం (2)
ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం (2)
ఏది నాకు కావాలో ఎంచి యిచ్చు నీ జ్ఞానం (2)
"అధికముగా"
