ఆరాధన నీకే దేవా – పూర్తి సాహిత్యం | THANDRI SANNIDHI MINISTRIES
ఆరాధన నీకే దేవా
ఆరాధన నీకే దేవా
ఆనందము నీవే కావా (2)
నా పాటలో పల్లవి
ఆశల జల్లువి
నీవేగా నా యేసయ్యా (2)
//ఆరాధన నీకే దేవా///
చరణం 1:
ఆత్మీయ పోరాటంలో
ఎదురయ్యే ఒడిదుడుకులలో (2)
ఎండబయలేదు క్షణమైన నీవు
ఏ వేళనైనా నను విడిపోవు (2)
(నా పాటలో...)
//ఆరాధన నీకే దేవా///
చరణం 2:
నా కనుల కన్నీరు తుడిచి
నీ ప్రేమ కౌగిట చేర్చి (2)
అపురూపమైన అనుభవము చూపి
నన్నదరించినా నా యేసయ్యా (2)
(నా పాటలో..)
//ఆరాధన నీకే దేవా//
చరణం 3:
నాలోన నను తొలగించి
నీ వశములో నన్ను నిలిపి (2)
నాలోన చేరి నా హృదయమేలి
నను వాడుకోనుము నా యేసయ్యా (2)
(నా పాటలో..)
//ఆరాధన నీకే దేవా//
