అలసిపోనీకుమా అలుపు రానీకుమా – పూర్తి సాహిత్యం | THANDRI SANNIDHI MINISTRIES
అలసిపోనీకుమా... అలుపు రానీకుమా
పల్లవి :
అలసిపోనీకుమా... అలుపు రానీకుమా
యేసయ్యా...యేసయ్యా...
నీ దివ్య సేవలో... నీ దీన పాత్రను
చరణం 1:
రాజా యాజక పరిచర్యను చేయగా నన్ను పిలిచితివే
కృంగిన వేలలో నా దారి చేరి
ధైర్యమునే నింపినవా... కాపరివై నడిపినవా...
||అలసి||
చరణం 2:
దేవా నీతో నా జీవితం - వాసివాదదు మన అనుబంధము
వ్యర్ధము కాలేదే నా ప్రయాస...
ఫలములనే ఇచ్చినవా...ఫలితమునే చూపినావా...
||అలసి||
చరణం 3:
అంధకారాలే నాకెదురుగా - నిలిచి దాడి చేసినాను
వెన్ను చూపక ముందుకు సాగే...
బలమునే ఇచ్చినవా... బాహువునే చాపినవా...
||అలసి||
