ఎన్నెనో మేలులతో నను దీవించావు | NANU DEEVINCHAVU | Telugu Christian Song Lyrics | Download
ఎన్నెనో మేలులతో నను దీవించావు | NANU DEEVINCHAVU | Telugu Christian Song Lyrics ఎన్నెనో మేలులతో నను దీవించావు ఎన్నెనో మేలులతో నను దీవించావు నా జీవితకాలమంత యెరిగి ఉన్నావు ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను ఎన్ని రీతులుగా కీర్తించగలను వందనాలు యేసయ్య నీకే శతకోటి స్తోత్రలయ్యా నీకే || 2 || || ఎన్నెనో మేలులతో || కష్టాల మార్గములో అలసిన పయణములో నిందలు మోయలేక కృంగిన సమయములో || 2 || సంపూర్ణముగా నాకు పరిశుద్దతనిచ్చావు సమాధాన కర్తవు నీవై నన్ను ఆదరించావు || 2 || || వందనాలు || ఏ గమ్యము ఎరుగని నా జీవిత యాత్రలో అలజడి అలలెన్నో చెలరేగెను నా మదిలో || 2 || కలవరమును కరిగించి, కరుణను కురిపించావు నా భయమును గద్దించి, నీ శాంతితో నింపావు || 2 || || వందనాలు || కలిగేటి శోధనలు, కనపడని మార్గములు నీ వాక్యమే దీపముగా, సాగెను నా పాదములు || 2 || అపవాదిని నా చేత, ఓడింప జేసావు వాగ్దాన పూర్ణుడిగా జయ జీవిత మిచ్చావు || 2 || || వందనాలు ||