Posts

Showing posts from October, 2026

Gatakaalamula Yandu Ghana | గతకాలముల యందు ఘన | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.62 - అనంత సహాయుడగు దేవుడు ॥ గత ॥ 1. గతకాలముల యందు - ఘన సహాయుడ దేవా-హిత నిరీక్షణ నీవే- యెన్నేండ్లకైన=అతిగా వీచిన గాడ్పు-లందు దుర్గం బీవె-నిత్యాంత గృహమీవె-నిత్యుడౌ ప్రభువా ॥ గత ॥ 2. నీ సింహాసన ఛాయ-లో సురక్షితముగ-వాసము సేయుదుము- భవ్యగుణ తేజా= నీ సుబాహువే చాలు-నిశ్చయ సురక్షా-వాసముగా నొప్పు-ప్రభువా ఘన దేవా ॥ గత ॥ 3. నగముల్ వరుస నిలిచి-నగధర నిర్మాణ-మగుటకు మున్నేయ-నంత ప్రభు నీవు-అగణిత వత్సరము అగువరకు నీవే మా- భగవంతుడవు నిన్ను ప్రణుతింతు మేము ॥ గత ॥ 4. వేయి యుగములు నీకు- దెస గతించిన యొక్క- సాయంత్ర సదృశము= సవిత్రుడురు శో-భాయుతముగ లే-వక ముందురాత్రిలో- ప్రహరము సుమియవ్వి ॥ గత ॥ 5. గత కాలముల యందు- ఘన సహాయుడ దేవా-హిత నిరీక్షణ నీవే- యెన్నేండ్లకైన- క్షితిజీవితాంతము-గతిగా నుండుము-దేవా - నితాంత గృహ మీవె-నిత్యుడౌ ప్రభువా ॥ గత ॥ ––జాన్ చౌధరి || Gata || 1. Gatakaalamula yandu - Ghana sahaayuda Devaa-hita nireekshana neeve- yenneendlakaina-atigaa veechina gaadpu-landu durgam beeve-nityaanta gruhameeve-nityudau Prabhuvaa || Gata || 2...

Ghanudaina Yehovaa Gadde | ఘనుడైన యెహోవా గద్దె | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.61 - సృష్టికర్త స్తుతి ఘనుడైన యెహోవా-గద్దె ముందుట మీరు- వినతు లిప్పుడు చేయుడి- యో జనులార-వినయంబుగా నిర్మ- లానంద రస లహరి- మన మనం బొప్పుచుండ- నో జనులార ॥ ఘనుడైన ॥ 1. ఒక్కడే మన కర్త యుండు దేవుడని యున్- జక్క గాను సృజియించు- సంహరించు ననియున్- నిక్కముగదెలిసికొండీ మన సహాయ మే- మక్కరలేకుండ మనల= మిక్కుటపు పరిపాలనపు బలము చేజెసె- మృత్తుచే మానవులగ-దిక్కు-గానక తిరుగు గొ-ర్రెల వలె మనము చెదర దిరుగదన దొడ్డిబెట్టె-నో జనులారా ॥ ఘనుడైన ॥ 2. మే మందరము వందనపు పాటతో మూగి-మించు నీ గుమ్మములలో- మా మా స్వరము లెత్తుదుము నభము పాడగా- మధురలయ సహితముగను-భూమియున్ దనదు పదివేల జిహ్వల వల=బొందైన నీ నగరి కా-ధామంబులను గాన సన్నుతి వితతి పూరి- తమ్ములుగజేయు దేవా యో జనులార ॥ ఘనుడైన ॥ 3. ధరయంత విస్తారమైయున్నది నీ యాజ్ఞ-తగ విరహితాద్యంతమై - స్థిరమైన కాలంబు వలెనె యున్న దయదయ- పొరలిపోవుచు నున్న వంత్సరముల్ నిలిచిపోయి నప్పటికి నీదు -సత్యంబు నిలిచియుండున్-వరశిలా ఖండ పర్వము తోడను సాటి-వన్నె కెక్కుచు నెంతయున్ ఓ జనులార ॥ ఘనుడైన ॥ ––విలియం డాసన్ Ghanudaina Yehovaa-gadde mund...