Posts

Showing posts from September, 2025

Meriseti Tarala Nanu Veliginchu | మెరిసేటి తారలా నను వెలిగించు | Telugu Christian Song Lyrics

Image
మెరిసేటి తారలా నను వెలిగించు | Meriseti Tarala Nanu Veliginchu | Telugu Christian Song Lyrics | Youtube Song Lyrics మెరిసేటి తారలా నను మెరిసేటి తారలా నను వెలిగించు కురిసేటి జల్లులా నను దీవించు నా ఊపిరివై నా జీవితమై నా ఊపిరివై నా జీవితమై నా ప్రాణ స్నేహమై నా రక్షకుడై 1. నీ కనులే నా మనసే తేరిచూడగా నాలోనా ఏ మంచి కానరాదుగా నీ కృపలో నా గతమే చూడలేదుగా సరిచేసి నడిపించు నీదు సాక్షిగా నీతి సూర్యుడా, నాదు యేసయ్య జీవితాంతము, జాలి చూపవా నా ప్రాణ స్నేహమై - నా రక్షకుడై 2. నీ మమతే తీయనిదీ మారదెన్నడు లాలించే నీ ప్రేమ వీడదెన్నడు ఊహలకే అందనిది నీదు కార్యము నీ మాటే నాలోన నిండు ధైర్యము సర్వశక్తుడా నాదు యేసయ్య ఆశ్రయించగా ఆదరించవా నా ప్రాణ స్నేహమై - నా రక్షకుడై

Swasthaparachu Devudu | స్వస్థపరచు దేవుడు | Latest Telugu Christian Song Lyrics

Image
స్వస్థపరచు దేవుడు | Swasthaparachu Devudu | Latest Telugu Christian Song Lyrics | Jesus Song Lyrics New స్వస్థపరచు దేవుడు స్వస్థపరచు దేవుడు – సర్వ శక్తిమంతుడు కష్ట కాలములోన నన్ను – మరచిపోడు నమ్మదగిన దేవుడు – ఎన్నడూ ఎడబాయడు మాట ఇచ్చిన దేవుడు – నెరవేరుస్తాడు నన్నే ఎన్నుకున్నాడు – నా పేరు పెట్టి పిలిచాడు శ్రమ ఎదురైనా – బాధేదైనా విడువని దేవుడు నా పక్షముగానే ఉన్నాడు – నా చేయి పట్టి నడిపాడు కృంగిన వేళ ధైర్యమునిచ్చి కృప చూపించాడు || స్వస్థపరచు || చీకటి నుండి వెలుగునకు నడిపించిన నా రక్షకుడు మరణము నుండి జీవముకు నను దాటించాడు మారా వంటి జీవితము మధురముగా మార్చాడు రోగము నిండిన దేహమును బాగు చేసాడు పొందిన దెబ్బల ద్వారానే స్వస్థతనిచ్చు దేవుడు చిందించిన రక్తము ద్వారా విడుదలనిచ్చియున్నాడు అతడే నా ప్రియ యేసుడు – యేసే నా ప్రియ స్నేహితుడు కౌగిలిలో నను హత్తుకొని కన్నీటిని తుడిచాడు || స్వస్థపరచు || దూతను ముందుగ పంపించి – మార్గము చక్కగ చేసాడు ఆటంకములు తొలగించి – విజయమునిచ్చాడు అగ్ని వంటి శ్రమలోన – నా తోడుగ ఉన్నాడు ధగ ధగ మెరిసే పసిడి వలె శుద్ధీకరించాడు నా యెడల ఉన్న ఉద్దేశములు హాని...

Emaina Cheyagalavu Katha Mottham | ఏమైనా చేయగలవు కథ మొత్తం | Telugu Christian Song Lyrics

Image
ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు | Emaina Cheyagalavu – Katha Mottham Marchagalavu | Telugu Christian Song Lyrics | Latest Song Lyrics ఏమైనా చేయగలవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్య యేసయ్య నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా? నీ కంచే దాటగ శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మాతొడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ, మేలైపోవును