Posts

Showing posts from October, 2024

Yesubaaluda Enthayu Vandana | యేసుబాలుడ ఎంతయు వందనం | Telugu Christian Christmas Song Lyrics

Image
యేసుబాలుడ ఎంతయు వందనం | Yesubaaluda Enthayu Vandana | Telugu Christian Christmas Song Lyrics | Bible Mission Song Lyrics SONG NO. 24 యేసుబాలుడ - యేసుబాలుడ - ఎంతయు యేసుబాలుడ - యేసుబాలుడ - ఎంతయు  వందనం - ఓ బాసుర దేవకుమార - భక్తివందనం =  ఓ భాసుర దేవకుమార - భక్తి వందనం 1. పసుల తొట్టిలోనే యప్పుడు - పండినావు = ఇపుడు -       వసుధ భక్తులందరిలోను - వాసము జేతువు      || యేసుబాలుడ || 2. యూదుల లోనే యావేళ ఉద్భవించితివి = ఇపుడు -       యూదాది సకల జనులలో - ఉద్భవింతువు      || యేసుబాలుడ ||

దేవదూత క్రిస్మసు | Telugu Christian ChriDevadootha Krismasu | stmas Song Lyrics Download

Image
దేవదూత క్రిస్మసు | Devadootha Krismasu | Telugu Christian Christmas Song Lyrics Download | Bible Mission Song Lyrics Christmas SONG NO. 23 దేవదూత క్రిస్మసు 1. దేవదూత క్రిస్మసు....... దూత సేన క్రిస్మసు      గొల్లవారి క్రిస్మసు....... తూర్పుజ్ఞాని క్రిస్మసు 2. చిన్నవారి క్రిస్మసు....... పెద్దవారి క్రిస్మసు      పేద వారి క్రిస్మసు....... గొప్పవారి క్రిస్మసు 3. పల్లెయందు క్రిస్మసు....... పట్నమందు క్రిస్మసు      దేశమందు క్రిస్మసు....... లోకమంత క్రిస్మసు 4. క్రిస్మసన్న పండుగ........ చేసికొన్న మెండుగ      మానవాత్మ నిండుగ....... చేయకున్న దండుగ 5. క్రీస్తు దేవదానము......... దేవవాక్య ధ్యానము      క్రీస్తు శిష్యగానము.......... వీనికాత్మ స్థానము 6. కన్నవారి క్రిస్మసు........ విన్నవారి క్రిస్మసు      క్రైస్తవాళి క్రిస్మసు........ ఎల్లవారి క్రిస్మసు 7. పాపలోకమందున........ క్రీస్తు పుట్టినందున      పాపికెంతో మోక్షము........ ఈ సువార్త సాక్ష్యము 8. క్రీస్తే సర్వభూపతి........ నమ్మువారి సద్గతి ...

Deva Lokamunundi Uyyalo | దేవ లోకమునుండి ఉయ్యాలో | Christmas Song Lyrics Telugu

Image
దేవ లోకమునుండి ఉయ్యాలో | Deva Lokamunundi Uyyalo | Christmas Song Lyrics Telugu | Bible Mission Songs Lyrics | Download SONG NO. 22 దేవ లోకమునుండి ఉయ్యాలో దేవ లోకమునుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి రుయ్యాలో 1. దేవలోకం బెల్ల ఉయ్యాలో........ తేజరిల్లిపోయె ఉయ్యాలో 2. గగన మార్గంబెల్ల ఉయ్యాలో........ గణగణ మ్రోగెను ఉయ్యాలో 3. లోకము పరలోకము ఉయ్యాలో........ యేకమై పోయెను ఉయ్యాలో 4. పరలోక దేవుండు ఉయ్యాలో........ ధరణిపై బుట్టెను ఉయ్యాలో 5. మహిమ బాలుండడిగో ఉయ్యాలో........ మరియమ్మ ఒడిలోన ఉయ్యాలో 6. సృష్టికర్త యడిగో ఉయ్యాలో........ శిశువుగా నున్నాడు ఉయ్యాలో 7. పశువుల తొట్టిదిగో ఉయ్యాలో.......పసి పాలకుండడిగో ఉయ్యాలో 8. బాలరాజునకు ఉయ్యాలో....... పాటలు పాడండి ఉయ్యాలో 9. బాలరక్షకునికి ఉయ్యాలో....... స్తోత్రములు చేయండి ఉయ్యాలో 10. పరలోకమంతట ఉయ్యాలో....... పరమ సంతోషమే ఉయ్యాలో 11. నాతండ్రి నాకోసం ఉయ్యాలో....... నరుడుగా బుట్టెను ఉయ్యాలో 12. ముద్దు పెట్టుకొనుడి ఉయ్యాలో........ ముచ్చట తీరంగ ఉయ్యాలో 13. మురియుచు వేయండి ఉయ్యాలో....... ముత్యాల హారములు ఉయ్యాలో 14. గొల్లబోయ లొచ్చి రుయ్యాలో....... గొప్పగ మురిస...

Devaloka Stotraganam | దేవలోక స్తోత్రగానమ్ | Bible Mission Christmas Song Lyrics

Image
దేవలోక స్తోత్రగానమ్ | Devaloka Stotraganam | Bible Mission Christmas Song Lyrics | Telugu Christian Song Lyrics | Download SONG NO. 21 దేవలోక స్తోత్రగానమ్ దేవలోక స్తోత్రగానమ్ - దేవాది - దేవునికి నిత్య దానమ్  - దేవలోక స్తోత్రగానమ్ - దీనులకు సుజ్ఞానం - గావించు  వర్తమానమ్ - క్రైస్తవాళి కాలమానమ్  - క్రిస్మస్ జయ్ జయ్      || దేవ || 1. భూమికిన్ శాంతి దానమ్ - స్తోత్రంబు - పూర్తి చేయగల       విధానం = భూమికిన్ శాంతి దానమ్ - బొందు దేవవేష్ట       జనం - క్షేమము సమాధానమ్ - క్రీస్తు శిష్య       కాలమానమ్ - క్రిస్మస్ జయ్ జయ్      || దేవ || 2. సర్వలోక రక్షణార్ధమ్ - ఈ వార్త - చాటించుట       ప్రధానమ్ = సర్వ లోక రక్షణార్ధమ్ - చాటించుట       ప్రధానమ్ - సర్వదేవ సన్నిధానమ్ సర్వలోక       కాలమానమ్ - క్రిస్మస్ జయ్ జయ్      || దేవ || 3. దేవలోక సంస్థానమ్ - మహోన్నత - దేవుని మహిమ       స్థానమ్ = దేవలోక సంస్థానమ్ - ...

Deva Stotraganamulu Pai Divya Sthalamulo | దేవ స్తోత్రగానముల్ పై దివ్య స్థలములో | Telugu Christian Song Lyrics

Image
దేవ స్తోత్రగానముల్ పై దివ్య స్థలములో | Deva Stotraganamulu Pai Divya Sthalamulo | Telugu Christian Song Lyrics | Bible Mission Christmas Song Lyrics | Download SONG NO. 20 దేవ స్తోత్రగానముల్ పై దివ్య స్థలములో దేవ స్తోత్రగానముల్ పై - దివ్య స్థలములో - దేవమారు  గానముల్ భూ - దేశ స్థలములో = దేవలోక  పావనులును - దీన నరులును బోవ జూడ - భువి దివి క్రిస్మస్ || దేవ || 1. అవ్వకిచ్చినట్టి వాక్కు - అదిగో తొట్టిలో - పవ్వళించి       యున్న దేవ బాల యేసులో = ఇవ్విధముగ        ఫలమాయే - ఈదినంబున నవ్వుమోము - నరుని కబ్బెను || దేవ || 2. షేము దేవ వందనంబు - చెప్పబడియెను భూమి       స్తుతుల నందు కొనెడి - పూజనీయుడు = భూమిపైన       నరుడుగాను - బుట్టవచ్చెను భూమి క్రిస్మస్ - భోగమొందెను || దేవ || 3. అందరి వంశంబులు నీ - యందు దీవెన - బొందునంచు       నబ్రామునకు నందెనువాక్కు = అందె క్రీస్తు       యూదులకును అన్యజనులకున్ విందు క్రిస్మస్ - విశ్వమంతటన్ || దేవ || 4. షీలో వచ్చువరకు యూ - దాలో న...

Deva Deva Deva Divi Nunna Devaa | దేవ దేవ దేవ దివి నున్న దేవా | Christmas Song Lyrics Telugu

Image
దేవ దేవ దేవ దివి నున్న దేవా | Deva Deva Deva Divi Nunna Devaa | Christmas Song Lyrics Telugu | Bible Mission Song Lyrics | Download SONG NO. 19 దేవ దేవ దేవ దివి నున్న దేవా దేవ దేవ దేవ - దివి నున్న దేవా! - పావన స్తోత్రముల్  - పరలోక దేవా దేవ 1. అన్ని లోకములకు - అవతలనున్న = ఉన్నత లోకాన       సన్నుతులుగొన్న దేవ      || దేవ || 2. మహిమ లోకంబున - మహిమ పూర్ణముగ =       మహనీయముగ నుండు - మానకుండగను దేవ      || దేవ || 3. నీ కిష్టులైనట్టి - లోకవాసులకు = రాకమానదు శాంతి       రంజిల్లు వరకు దేవ      || దేవ || 4. ధరణి మీదను - సమాధానంబు కలుగు = నరులకు       నీదర్శనం బిచట కలుగు దేవ      || దేవ || 5. వధువు సంఘమునకు బాలుండు పుట్టు = వృధిని       సువార్తకు పెరుగుట పట్టు దేవ      || దేవ || 6. ప్రసవవేదన పొంది - వధువు సభ అరసె = అసలైన       మగబిడ్డ అదునుకు వెలసె దేవ      || దేవ ||

Yesu janminchen ilalo | యేసు జన్మించెన్ ఇలలో | Telugu Christian Christmas Song

Image
యేసు జన్మించెన్ ఇలలో | Yesu janminchen ilalo | Telugu Christian Christmas Song | Bible Mission Song Lyrics | Download SONG NO. 18 యేసు జన్మించెన్ ఇలలో యేసు జన్మించెన్ ఇలలో - యేసు జన్మించెన్ - పాపుల కొరకును శుద్ధులకొరకును - యేసు జన్మించెన్ = ఈ సంతసమగు వర్తమానము - ఎల్ల జనుల వీనుల మ్రోగు గాక - విభునకు స్తోత్రము      || యేసు || 1. లోకము కొరకును నాకై నీకై ఆ కాలమునకై - ఈ కాలమునకై -      లోకరక్షకుడగు యేసుడు బుట్టెను - ఆ కైసరౌగుస్తు అరయలేదు      ప్రభున్ = ఇది ఆశ్చర్యము - ఎంతో విచారము - ఏల నతడు ప్రభు      - నెరుగకపోయెనో      || యేసు || 2. భూజనాంగములకై నాకై నీకై - రాజులకై హే - రోదు రాజు      కొరకై - రాజగు యేసుడు - రంజిల్ల బుట్టెను - రాజగు హేరోదు      ప్రభువు నరయలేదు = ఇది ఆశ్చర్యము - ఎంతో విచారము -      యేల నతడు ప్రభు - నెరుగక పోయెనో      || యేసు || 3. సర్వ లోకమునకై నాకై నీకై - సర్వ వేదజ్ఞులౌ - శాస్త్రుల కొరకై -      ఉర్విని యేసుడు - ఉద్భవించెన...

Panktuloki randi Krismasu panktuloki | పంక్తిలోకి రండి క్రిస్మసు పంక్తిలోకి | Telugu Christian Christmas Song Lyrics

Image
పంక్తిలోకి రండి క్రిస్మసు పంక్తిలోకి | Panktuloki randi Krismasu panktuloki | Telugu Christian Christmas Song Lyrics | Bible Mission Christmas Song Lyrics | Download SONG NO. 17 పంక్తిలోకి రండి క్రిస్మసు పంక్తిలోకి పంక్తిలోకి రండి - క్రిస్మసు పంక్తిలోకి రండి క్రిస్మసు పంక్తిలోకి రండి      || పంక్తి || 1. ఎరుకపరుపలెండి - క్రిస్మసు నెరుక పరుపలెండి - క్రిస్మసు      నెరుక పరుపలెండి = వెరువకుడి శుభ - వార్త యిదియం      దర కానంద - కరమైనది మీ కొరకై రక్ష - కుండు బుట్టెనని      = ఎరిగించిన గబ్రి - యేలు దూత      || పంక్తి || 2. మహిమ పరుప రండి - దేవుని మహిమ పరుప రండి - దేవుని      మహిమ పరుప రండి = మహికిన్ దేవ కు - మారుడు వచ్చిన      మహిమకార్య స - న్మానార్ధంబై - మహిమ సంభవ - మగు దేవునికిని      = మహిమగ పలికిన - మహిమ దూతల      || పంక్తి || 3. దేవ ప్రియులగుడి - క్రిస్మస్ దేవ ప్రియులగుడి - క్రిస్మస్      దేవ ప్రియులగుడి = దేవుని కిష్టులౌ వారలకు  ...

Nedu Devudu ninnu chooda vachinaadu | నేడు దేవుడు నిన్ను | Telugu Christian Song Lyrics

Image
నేడు దేవుడు నిన్ను | Nedu Devudu ninnu chooda vachinaadu | Telugu Christian Song Lyrics | Bible Mission Christmas Song Lyrics | Download SONG NO.16 నేడు దేవుడు నిన్ను చూడ వచ్చినాడు నేడు దేవుడు నిన్ను - చూడ వచ్చినాడు - మేలుకో -  నరుడా మేలుకో = ఇదిగో - నేడు రక్షణ తెచ్చినాడు నీ  కోసమై - మేలుకో పాపము చాలుకో 1. దైవ కోపము నుండి - తప్పించు బాలుని - ఎత్తుకో -       నరుడా ఎత్తుకో = తుదకు - నీవు మోక్షము చేరి       నిత్యముండుటకై ఎత్తుకో - బాలుని హత్తుకో      || నేడు || 2. నరకంబు తప్పించు - నరుడౌ దేవపుత్రుని - పుచ్చుకో       నరుడా పుచ్చుకో = మరియు దురితాలన్ గెల్పించు       పరిశుద్ధబాలుని పుచ్చుకో - దేవుని మెచ్చుకో      || నేడు || 3. హృదయమను తొట్టెలో - నే యుండుమని మొర్ర -       బెట్టుకో మొర్ర - బెట్టుకో = మనకు -ముదమిచ్చి బ్రోచెడి       - ముద్దు బాలకుని పట్టుకో - ముద్దు బెట్టుకో      || నేడు ||

దేవా మేము నమ్మదగిన | Devaa Memu nammadagina | Telugu Christian Song Lyrics

Image
దేవా మేము నమ్మదగిన | Devaa Memu nammadagina | Telugu Christian Song Lyrics | Bible Mission Songs | Download SONG NO. 15 దేవా మేము నమ్మదగిన దేవా! మేము నమ్మదగిన వారమా - సృష్టి కర్తా! నరుల  హృదయము - నందు నీకు స్తోత్ర గీతము      || దేవా మేము || 1. నాలోని అవిశ్వాసము పో - గొట్టు దేవుడవు =      నా సందేహమును - అణచునట్టి దేవుడవు || దేవా మేము || 2. నాలోపుట్టు సంశయము మా - న్పించు దేవుడవు =      అపనమ్మికను నిర్మూల - పరచునట్టి కర్తవు      || దేవా మేము || 3. అనుమానము లేకుండా - జేయు ఆత్మవు =      వెనుకాడు గుణము బెరికి - వేయు విజయశాలివి      || దేవా మేము || 4. నీ ప్రేమను నమ్మని నైజము - కూల్చు తండ్రివి =      నీ శక్తిని నమ్మని బుద్ధిని పరిమార్చు ప - రాక్రమ శాలివి || దేవా మేము || 5. అవిశ్వాసపు సంగతులు - దహించు అగ్నివి =      అవి నాలోనుండి తీసివేయు వి - శ్వాస పాత్రుడవు      || దేవా మేము || 6. క్రీస్తునుబట్టి ఈ మేలు - చేయు దేవా! =      నా హృదయము నిం...

Naa Cheruvai Na Snehami | నా చేరువై నా స్నేహమై | Telugu Christian Song Lyrics

Image
నా చేరువై నా స్నేహమై | Naa Cheruvai Na Snehami | Telugu Christian Song Lyrics | Trending Christian Song | Download నా చేరువై నా స్నేహమై నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య నీ ప్రేమలోనే నేనుండిపోనీ నీ సేవలోనే నను సాగనీ నీ ధ్యాసలోనే మైమరచిపోనీ నీ వాక్కు నాలో నెరవేరనీ నా వరం నా బలం నీవే నా గానం నా ధనం నా ఘనం నీవే ఆనందం తోడుగా నీడగా నీవే నా దైవం ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం 1. నా వేదనందు - నా గాయమందు నిను చేరుకున్నా - నా యేసయ్య నీ చరణమందు - నీ ధ్యానమందు నిను కోరుకున్నా - నీ ప్రేమకై కరుణించినావు నను పిలచినావు గమనించినావు ఘనపరచినావు నీవేగా దేవా నా ఊపిరి 2. నా జీవితాన - ఏ భారమైన నీ జాలి హృదయం - లాలించెనే ప్రతికూలమైన - ఏ ప్రళయమైన ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య విలువైన ప్రేమ కనపరచినావు బలపరచి నన్ను గెలిపించినావు నీవేగా దేవా నా ఊపిరి

Deva Neeve - Stotra Patrudavu | దేవా నీవే - స్తోత్ర పాత్రుడవు | Bible Mission Song Lyrics Telugu

Image
దేవా నీవే - స్తోత్ర పాత్రుడవు | Deva Neeve - Stotra Patrudavu | Bible Mission Song Lyrics Telugu | Jesus Christ Song Lyrics | Download   SONG NO. 14 దేవా! నీవే - స్తోత్ర పాత్రుడవు దేవా! నీవే - స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే - మహిమ రూపివి                                                                                                      || దేవా నీవే || 1. కాబట్టి నేను నిన్ను స్తు - తించు చున్నాను = నిన్ను       స్తుతించు స్తుతినే - యెంచు కొనుచున్నాను      || దేవా నీవే || 2. దేవదూతలు నిన్ను స్తు - తించు చున్నారు = వారే       మహిమతో స్తో - త్రించుచున్నారు      || దేవా నీవే || 3. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తు - ...

Stuti Cheya Randi Randi | స్తుతి చేయ రండి రండి | Jesus Song Lyrics Telugu

Image
స్తుతి చేయ రండి రండి | Stuti Cheya Randi Randi | Jesus Song Lyrics Telugu | Bible Mission Song Lyrics | Download Lyrics SONG NO. 13 స్తుతి చేయ రండి రండి స్తుతి చేయ రండి రండి - సోదరులారా - స్తుతి స్తుతులు  చేయ రండి = స్తుతుల వెన్క స్తుతులు చేయ - స్మృతి  కృతజ్ఞత ఊరును - మతి కడకు మోక్షంబు తట్టు -  మళ్ళునపుడు వెళ్ళగలము 1. ఇక్కడ స్తుతి సాగదు - మనము వెళ్ళు - అక్కడ స్తుతి       సాగును = ఇక్కడనె స్తుతి చేయసాగుట - కెంతయును       యత్నంబు చేసిన - యెక్కడ లేనట్టి శ్రమలు - ముక్క       ముక్కలై పోవున్      || స్తుతి చేయ||

Stuthulu Ghana Samstuthulu | స్తుతులు ఘన సంస్తుతులు | Bible Mission Song Lyrics

Image
స్తుతులు ఘన సంస్తుతులు | Stuthulu Ghana Samstuthulu | Bible Mission Song Lyrics | Telugu Christian Song Lyrics | Download SONG NO. 12 స్తుతులు ఘన సంస్తుతులు స్తుతులు ఘన సంస్తుతులు నీకే - మతిలో నా తండ్రి =  ప్రతి విషయ ప్రార్దన సమయంబున - కృతజ్ఞతా స్తోత్రము తండ్రి 1. ప్రసవ వేదన ప్రార్దన చేయు - వాలిమ్ము తండ్రి = నిసుపై       నా విజ్ఞాపన ప్రార్దన - నేర్పు ప్రసాదించుము తండ్రి  ||స్తుతులు|| 2. ఆ స్థితి యుంచుము నెరవేరు ప - ర్యంతము నా తండ్రి  - దుస్థితి పోవుట భాగ్యములన్నిట - దొడ్డ భాగ్యమె నా తండ్రి  ||స్తుతులు||

Vijaya Samstutule Neeku | విజయ సంస్తుతులే నీకు | Telugu Christian Song Lyrics

Image
విజయ సంస్తుతులే నీకు | Vijaya Samstutule Neeku | Telugu Christian Song Lyrics | Bible Mission Song Lyrics | Download SONG NO. 11 విజయ సంస్తుతులే నీకు విజయ సంస్తుతులే నీకు - ప్రేమ స్వరూపా! - విజయ  సంస్తుతులు నీకు = జయమే లభించు నీకు -  విశ్వమంతట సర్వ దీక్ష - ప్రజల వలన నిత్యమైన -  ప్రణుతులు సిద్ధించు నీకు      || విజయ || 1. నేడు మా పనులెల్లను - దీవించుము - నిండుగా       వర్ధిల్లును = చూడవచ్చిన వారికిని బహు -       శుభకరముగా నుండునటుల - కీడు బాపుచు మేళ్ళను       సమ - కూడ జేసిన నీకే కీర్తి      || విజయ || 2. ఆటలాడుకున్నను నీ నామమున - పాటల్       పాడుకున్నను = నాటకంబుల్ కట్టుకున్నను -       నాట్యమాడుచు మురియుచున్నను - కూటములను       జరుపుకున్నను - నీటుగను నీ కేను కీర్తి      || విజయ || 3. పరలోకమున కీర్తి - దేవా! నీకే ధరణియందున కీర్తి =       నరుల హృదయములందు కీర్తి - పరమ దూతలందు   ...

Sthuthi Jethumu Neeku | స్తుతి జేతుము నీకు | Jesus Song Lyrics Telugu | Bible Mission Song Lyrics

Image
స్తుతి జేతుము నీకు | Sthuthi Jethumu Neeku | Jesus Song Lyrics Telugu | Bible Mission Song Lyrics | Download SONG NO. 10 స్తుతి జేతుము నీకు స్తుతి జేతుము నీకు - దేవ - స్తుతి జేతుము నీకు  = గతియించెను కీడెల్లను గాన - స్తుతి గానము  జేయుదమో తండ్రి      || స్తుతి || 1. వేడుకొనక ముందే - ప్రార్ధన - వినియుంటివి దేవా       = నేడును రేపును ఎల్లప్పుడు సమ - కూడును       స్తుతి గానము నీకిలలో      || స్తుతి || 2. మనసును నాలుకయు - నీకు - అనుదిన స్తుతి       జేయున్ = జనక కుమారాత్మలకు స్తోత్రము -       ఘనతయు మహిమయు కలుగును గాక!      || స్తుతి ||

Daivatma Rammu | దైవాత్మా రమ్ము | Bible Mission Songs Lyrics

Image
దైవాత్మా రమ్ము | Daivatma Rammu | Bible Mission Songs Lyrics | Telugu Christian Song Lyrics Download SONG NO. 09 దైవాత్మా రమ్ము దైవాత్మా రమ్ము - నా తనువున వ్రాలుము - నా =  జీవమంతయు నీతో నిండ - జేరి వసింపుము      || దైవాత్మా || 1. స్వంత బుద్ధితోను - యేసు - ప్రభుని నెఱుగలేను - నే = నెం      తగ నాలోచించిన విభుని - నెఱిగి చూడ లేను      || దైవాత్మా || 2. స్వంత శక్తితోను - యేసు - స్వామి జేరలేను - నే =       నెంత నడచిన ప్రభుని కలిసికొని - చెంత జేరలేను      || దైవాత్మా || 3. పాప స్థలము నుండి - నీ సు - వార్త కడకు నన్ను - భువి       నో = పరమాత్మ! నడుపు చుండుము - ఉత్తమ స్థలమునకు      || దైవాత్మా || 4. పాపములో మరల - నన్ను పడకుండగ జేసి - ఆ నీ =       పరిశుద్ధమైన రెక్కల - నీడను కాపాడు      || దైవాత్మా || 5. పరిశుద్ధుని జేసి - నీ - వరములు దయచేసి - నీ =       పరిశుద్ధ సన్నిధిని జూపుమా - పావురమా! వినుమా      || ...

Deva Yehovah Stuti Pathrundu | దేవ యెహోవా స్తుతి పాత్రుండ | Bible Mission Song Lyrics Telugu

Image
దేవ యెహోవా స్తుతి పాత్రుండ | Deva Yehovah Stuti Pathrundu | Bible Mission Song Lyrics Telugu | Christian Song Lyrics Telugu | Download SONG NO. 08 దేవ యెహోవా స్తుతి పాత్రుండ దేవ యెహోవా! స్తుతి పాత్రుండ! - పరిశుద్ధాలయ  పరమ నివాసా!      || దేవ || 1. బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత - సర్వము నీవే =       సకల ప్రాణులు స్తుతి చెల్లించగ - సర్వద నిను స్తుతు -       లొనరించగనున్న      | | దేవ || 2. నీదు పరాక్రమ కార్యములన్నియు - నిరతము నీవే =       నీదు ప్రభావ మహాత్యము లన్నియు - నిత్యము       పొగడగ నిరతము స్తోత్రములే      || దేవ || 3. స్వర మండల సితారలతోను - బూరల ధ్వనితో =       తంబురలతో నాట్యము లాడుచు - నిను       స్తుతియించుచు - స్తోత్రము జేసెదము      || దేవ || 4. తంతి వాద్య పిల్లన గ్రోవి - మ్రోగెడు తాళము = గంభీర       ధ్వని గల తాళములతో - ఘనుడగు దేవుని కీర్తించను     ...

Sri Sabhavadhuvaraya | శ్రీ సభావధూవరాయ | Bible Mission Song Lyrics Telugu

Image
శ్రీ సభావధూవరాయ | Sri Sabhavadhuvaraya | Bible Mission Song Lyrics Telugu | Jesus Song Lyrics Download SONG NO. 07 శ్రీ సభావధూవరాయ శ్రీ సభావధూవరాయ! నమః - కృపా పూర్ణుడ! =  భాసురంబైన సిం - హాసనంబును మా - కోసము వీడి  వచ్చితివి - 1తదర్ధమై                                                                                           || శ్రీ సభా || 1. పథము దప్పిన సంఘ - వధువును వెదుక మోక్ష =       పథమై వేం - చేసినావు - తదర్ధమై                                                                     ...

Mangalastotraarpanalu | మంగళస్తోత్రార్పణలు | Telugu Christian Song Lyrics

Image
మంగళస్తోత్రార్పణలు | Mangalastotraarpanalu | Telugu Christian Song Lyrics | Bible Mission Song Lyrics | Download SONG NO. 06 మంగళస్తోత్రార్పణలు మంగళస్తోత్రార్పణలు -మహనీయ దేవునికి - అంగున్న  లేకున్న - అంతములేని స్తుతులు మంగళార్చ 1. ఎట్టివారినైన-ఏస్థలమునందైన - పట్టి రక్షించుటకై       పాట్లొందు తండ్రికి మంగళార్చ    ||మంగళ|| 2. యేసుక్రీస్తై వచ్చి - యిల మానవుల మధ్య - వాసంబు       జేసిన పరమ దేవునికి మంగళార్చ      ||మంగళ|| 3. నరులకు తండ్రిగా -నరరక్షపుత్రుడుగా -       పరిశుద్ధాత్ముండుగా బైలైన దేవునికి మంగళార్చ      ||మంగళ||

Stotramu cheyumu Srushtikartaku | స్తోత్రము చేయుము సృష్టికర్తకు | Telugu Christian Bible Mission Song Lyrics

Image
స్తోత్రము చేయుము సృష్టికర్తకు | Stotramu cheyumu Srushtikartaku | Telugu Christian Bible Mission Song Lyrics | Download SONG NO. 05 స్తోత్రము చేయుము సృష్టికర్తకు స్తోత్రము చేయుము సృష్టికర్తకు - ఓ దేవ నరుడా!  - స్తోత్రము చేయుము సృష్టికర్తకు = స్తోత్రము  చేయుము శుభకర మతితో - ధాత్రికి గడువిడు -  దయగల తండ్రికి 1. పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమై - ఆపద       వేళల కడ్డము బెట్టక - ఆపద మ్రొక్కులు       అవిగైచేయక = నీపై సత్ కృప జూపెడు తండ్రికి ||స్తోత్రము|| 2. యేసు ప్రభువుతో నెగిరిపోవ భూ - వాసులు       సిద్దపడు నిమిత్తమై - ఈ సమయంబున       - ఎంతయు ఆత్మను = పోసి ఉద్రేకము -       పొడమించు తండ్రికి    ||స్తోత్రము||

Devaa Tandri Neeku | దేవా తండ్రీ నీకు | Bible Mission Christian Song Lyrics Telugu | Download

Image
దేవా తండ్రీ నీకు | Devaa Tandri Neeku | Bible Mission Christian Song Lyrics Telugu | Download దేవా తండ్రీ నీకు SONG NO. 03      దేవా తండ్రీ నీకు - దిన దిన స్తుతులు = నావిన్నపము విన్న నాధా సంస్తుతులు  1. అపవిత్రాత్మల దర్శన - మాపియున్నావు = ఎపుడైన అవి నా - కేసి రానీయవు|| దేవా ||  2. చెడ్డ ఆత్మల మాటల్ - చెవిని బడనీయవు = గడ్డు పలుకుల నోళ్ళు - గట్టియున్నావు|| దేవా ||  3. చెడు తలంపులు పుట్టిం - చెడి దుష్టాత్మలను నా = కడకు రానీయవు - కదల నీయవు|| దేవా ||  4. పాపంబులను దూర - పరచి యున్నావు = పాపంబులను గెల్చు - బలమిచ్చినావు|| దేవా ||  5. పాప ఫలితము లెల్ల - పారదోలితివి = శాప సాధనములు - ఆపివేసితివి || దేవా ||  6. దురిత నైజపు వేరు - పెరికి యున్నావు = పరిశుద్ధ నైజ సం - పద యిచ్చినావు|| దేవా ||  7. ప్రతి వ్యాధినిన్ స్వస్థ - పరచి యున్నావు = మతికి ఆత్మకును నె - మ్మది యిచ్చినావు|| దేవా ||  8. అన్న వస్త్రాదుల - కాధార మీవె = అన్ని చిక్కులలో స - హాయుండ వీవే|| దేవా ||  9. ననుగావ గల దూత - లను నుంచినావు = నిను నమ్ము విశ్వాస - మును నిచ్చినావు|| దేవా ...

Anaadi Purushundaina Devuni | అనాది పురుషుండైన దేవుని | Bible Song Lyrics Telugu

Image
అనాది పురుషుండైన దేవుని | Anaadi Purushundaina Devuni | Bible Song Lyrics Telugu | Telugu Christian Song Lyrics | Download అనాది పురుషుండైన దేవుని SONG NO. 02      అనాది పురుషుండైన దేవుని - ఆరాధించండి =       అనాది దేవుండే అనంత దేవుడై యుండె = అనాదిని 1. ఒక్కండే దేవుండు - ఒంటరిగానే యుండె - అనాదిని =       ఎక్కువ మందియైన - ఎవరిని గొల్వవలెనో తెలియదు - ఆందోళం  ||అనాది|| 2. పాపంబు నరులకు - పరమాత్ముని మరుగు చేసెను -       అయ్యయ్యో పాపు లందుచేత - పలువిధ దేవుండ్లను కల్పించిరి - విచారం  ||అనాది|| 3. గనుక సర్వంబునకు - కర్తయైన ఏకదేవున్ - కనుగొనుడి =       కనుగొని మ్రొక్కండి - అని బోధించుచున్నాము - శుభవార్త ||అనాది|| 4. ఆకాశము భూమియు - లేక ముందే కాలము - దూతలు =       లేకముందే దేవుడు - ఏక దేవుండై యుండె - గంభీరం! ||అనాది||

Shubhaakaraa Shuddhaakaraa | శుభాకరా శుద్ధాకరా వి - శుద్ధ వందనమ్ | Bible Mission Song Lyrics Telugu

Image
శుభాకరా శుద్ధాకరా వి - శుద్ధ వందనమ్ | Shubhaakaraa Shuddhaakaraa | Telugu Christian Song Lyrics | Bible Mission Song Lyrics  శుభాకరా శుద్ధాకరా SONG NO. 01      1శుభాకరా! శుద్ధాకరా! వి - శుద్ధ వందనమ్ =      2నభా నభూమి సర్వౌ - న్నత్య వందనమ్ 1. యెహోవ! స్రష్ట! జనక! నీకు-నెంతయు 3బ్రణుతి =      మహోన్నతుండ! దివ్యుడా! ఘన - మహిమ సంస్తుతిశుభా ||శుభా|| 2. విమోచకా! 4పిత్రాత్మజుండ! - విజయ మంగళమ్ =      సమస్త సృష్టి సాధనంబ! - సవ్య మంగళమ్శుభా ||శుభా|| 3. వరాత్మ! 5పితాపుత్ర నిర్గమ - పరుడ! స్తోత్రము =      వరప్రదుండ! భక్త హృదయ - వాస! స్తోత్రముశుభా ||శుభా|| 1.శుభమునకు ఉనికిపట్టు 2.ఆకాశమందు 3.స్తుతి   4.తండ్రి యొక్క కుమారుడా!   5.తండ్రి నుండియు కుమారుని నుండియు బయలుదేరిన దేవా!

Ghanamainavi nee karyamulu naa yedala | ఘనమైనవి నీ కార్యములు నా యెడల | Telugu Christian Hosanna Ministries Song Lyrics

Image
ఘనమైనవి నీ కార్యములు నా యెడల | Ghanamainavi nee karyamulu naa yedala | Telugu Christian Hosanna Ministries Song Lyrics | Download ఘనమైనవి నీ కార్యములు నా యెడల ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞాత కలిగి స్థుతులర్పించేదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే || ఘనమైనవి || ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరణీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము బాపి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) || ఘనమైనవి || నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైనబండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతి క్షణమును నీవు దీవెనెగా మార్చి నడిపించుచున్నావు -  ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) || ఘనమైనవి || నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా -  బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా ఎడ చాలున్నంటివే (2) నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము (2)  ...

Neeve Naa Santhosha Gaanamu | నీవే నా సంతోషగానము | Telugu Christian Song Lyrics

Image
నీవే నా సంతోషగానము | Neeve Naa Santhosha Gaanamu | Telugu Christian Song Lyrics | Download | Hosanna Ministries Song Lyrics నీవే నా సంతోషగానము నీవే నా సంతోషగానము రక్షణశృంగము మహాశైలము (2) బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా|| ఓ లార్డ్! యు బి ద సేవియర్ షో మి సం మెర్సీ బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్ సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ ఐ విల్ సరెండర్ యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2) నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా|| వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2) మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా|| నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు హీనశరీరం మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2) హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ...